ఆసుపత్రి నుంచి బాలకృష్ణ డిశ్చార్జ్

ప్రముఖ టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ సోమవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

Last Updated : Feb 5, 2018, 04:10 PM IST
ఆసుపత్రి నుంచి బాలకృష్ణ డిశ్చార్జ్

ప్రముఖ టాలీవుడ్ నటుడు, టీడీపీ హిందూపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ సోమవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కుడిభుజం నొప్పితో బాధపడుతున్న ఆయన.. శనివారం హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. డాక్టర్ దీప్తి నందన్ రెడ్డి, డాక్టర్ ఆశిష్ బాబుల్కర్ లు బాలయ్యకు శస్త్ర చికిత్స చేశారు.

శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ఆసుపత్రి వైద్యులు బాలకృష్ణను రెండు రోజులపాటు పర్యవేక్షణలో ఉంచుకున్నారు. అనంతరం బాలయ్య సోమవారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు ఐదు నుండి ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరమని, ఆసుపత్రికి వచ్చేవారంలో మొదటి చెక్ అప్ కోసం వస్తారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించారు.

Trending News