Trolls on Chinmayi Sripada: సమంత జీవితాన్ని నాశనం చేశావ్.. నీ భర్తను కుక్కలా ట్రీట్ చేసి ఆడిస్తున్నావ్.. నెటిజన్లకు చిన్మయి రిప్లై వైరల్

Chinmayi Sripada Gets Trolls సింగర్ చిన్మయి శ్రీపాద తాజాగా నెటిజన్ల మీద మండి పడింది. సమంత జీవితాన్ని నాశనం చేశావ్ అని, ఆమె విడాకులు కారణం అయ్యావ్ అని ఇలా నానా రకాలుగా చిన్మయిని జనాలు ట్రోల్స్ చేస్తూ వచ్చారు. వాటిని చిన్మయి తన స్టైల్లో తిప్పి కొట్టేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2023, 12:55 PM IST
  • నాగ చైతన్యతో సమంత విడాకులు
  • మరోసారి తెరపైకి చిన్మయి పేరు
  • నెటిజన్ల ట్రోలింగ్‌పై సింగర్ సెటైర్లు
Trolls on Chinmayi Sripada: సమంత జీవితాన్ని నాశనం చేశావ్.. నీ భర్తను కుక్కలా ట్రీట్ చేసి ఆడిస్తున్నావ్.. నెటిజన్లకు చిన్మయి రిప్లై వైరల్

Trolls on Chinmayi Sripada: సమంత ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌లో చిన్మయి, నందినీ రెడ్డి, ప్రీతమ్, శిల్పా రెడ్డి, డా మంజుల ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తుంటాయి. నాగ చైతన్యతో సమంత విడాకుల విషయం బయటకు వచ్చాక.. వేళ్లన్ని కూడా వారి వైపు వెళ్లాయి. సమంతను వారే ప్రభావితం చేశారని, వారే మార్చేశారని ఇలా నానా రకాలుగా కామెంట్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా ప్రీతమ్, చిన్మయిల మీద ఎక్కువగా ట్రోలింగ్ జరిగింది.

చిన్మయి భయంకరమైన ఫెమినిస్ట్ అని, ఆమె వల్లే సమంత ఇలా తయారైందని, అందుకే పచ్చని కాపురం నాశనం అయిందంటూ ఆ మధ్య ట్రోల్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి చిన్మయి మీద నెటిజన్లు విరుచుకుపడ్డారు. చిన్మయి వల్లే సమంతకు డివోర్స్ జరిగాయని ఆరోపిస్తున్నారు. నీ వల్లే సమంతకు నాగ చైతన్యకు విడాకులు జరిగాయి.. జీవితం నాశనం అయింది.. కానీ నువ్ మాత్రం నీ భర్తను కుక్కలా ఆడిస్తూ హాయిగా ఉంటున్నావ్.. అంటూ ఇలా దారుణంగా మాట్లాడసాగారు.

దీనిపై చిన్మయి స్పందించింది. ఇలాంటి కామెంట్లు చేసే అబ్బాయిలు చాలా డేంజర్.. అమ్మాయిలు దయచేసి ఇటువంటి ఎదవల్ని పెళ్లి చేసుకోకండి.. ఇటువంటి ఫ్యామిలీస్ నుంచి దూరంగా ఉండండి అని కౌంటర్లు వేసింది చిన్మయి. మొత్తానికి చిన్మయి మాత్రం మరోసారి సోషల్ మీడియాలో ఇలా హాట్ టాపిక్ అవుతోంది.

Also Read:  Samantha : సమంత ఆంటీ ఇంకా రెండు రోజులే ఉంది!.. సామ్ రిప్లై ఇదే

మొన్నటికి మొన్న దలైలామ వీడియో మీద స్పందించింది. చిన్న పిల్లాడితో అలా చేయించుకోవడం తప్పని చిన్మయి అంటే.. దాని మీద కూడా ట్రోలింగ్ చేశారు. ముందు మన సమస్యల మీద స్పందించు.. వేరే దేశం గురించి నీకు ఎందుకు అని ఓ నెటిజన్ కౌంటర్లు వేశాడు. ఏ దేశంలో అయినా.. పిల్లలను అలా చేయడం తప్పు.. పైగా ఆ పిల్లాడు మన ఇండియన్ .. ముందు తెలుసుకో.. అంటూ నెటిజన్లకు కౌంటర్లు వేసింది చిన్మయి.

ఇక చిన్మయి, రాహుల్ రవీంద్రన్‌లు తమ పిల్లలను చూపిస్తూ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంటే వాటి మీద కూడా ట్రోలింగ్ చేయసాగారు. ఫ్యూచర్ ఫెమినిస్ట్‌లు కూడా రెడీ అవుతున్నారు అంటూ చిన్న పిల్లలను కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Also Read: Renu Desai : పవన్ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడు?.. నిలదీసిన నెటిజన్.. రేణూ దేశాయ్ రిప్లై వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News