‘శ్రీదేవి బంగ్లా’ వివాదం ; హీరోయిన్ ప్రియా ప్రకాశ్‌కు లీగల్ నోటీసులు !!

శ్రీదేవి బంగ్లా వివాదంతో ప్రియా ప్రకాశ్ వారియర్ కు సంబంధం ఏం అనుకుంటున్నారు..అయితే వివరాల్లో వెళ్లండి.. మీకే అర్థమౌతుంది.

Last Updated : Jan 15, 2019, 08:57 PM IST
‘శ్రీదేవి బంగ్లా’ వివాదం ; హీరోయిన్ ప్రియా ప్రకాశ్‌కు లీగల్ నోటీసులు !!

‘శ్రీదేవి బంగ్లా’ చిత్రం వివాదాలకు కేంద్రంగా నిలిచింది. దీనిపై వివరణ కోరుతూ హీరోయిన్ ప్రియాప్రకాశ్ తో పాటు చిత్రం యూనిట్ కు లీగల్ నోటీసులు అందాయి. ఇంతకీ ఈ లీగల్ నోటీసులు ఎందుకు పంపినట్లు ఎవరి పంపినట్లు అనే విషయం తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే....

ఇది శ్రీదేవి బయోపిక్ ?
మళయాలంలో తెరకెక్కిస్తున్న  ‘శ్రీదేవి బంగ్లా’ చిత్రం వివాదాలకు కేంద్రంగా నిలిచింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాప్రకాశ్ వారియర్ నటిస్తోంది. మలయాళ దర్శకుడు ప్రశాంత్‌ మాంబుల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. సరిగ్గా ఇక్కడే వివాదం రాజుకుంది.

శ్రీదేవి భర్త బోనీ అభ్యంతరం
‘శ్రీదేవి బంగ్లా’ మూవీ ట్రైలర్‌, టైటిల్‌ని బట్టి చూస్తే ఇది అలనాటి తార శ్రీదేవి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రమా? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. అదీకాకుండా శ్రీదేవి బాత్‌టబ్‌లో పడి చనిపోయిన సన్నివేశాన్ని చూపించడం.. అలాగే  సినిమాలో ప్రియ.. శ్రీదేవి అనే టాప్‌ హీరోయిన్‌ పాత్రలో నటించడంతో సందేహాలు మరింత బలపడుతున్నాయి. దీంతో శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ హీరోయిన్ ప్రియతో పాటు చిత్రయునిట్ కు లీగల్ నోటీసులు పంపించారు.ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్‌ మాంబుల్లి మీడియాకు తెలిపారు. 

ధైర్యంగా ఎదుర్కొంటాం...

ఈ మూవీ వివాదంపై డైరెక్టర్ ప్రశాంత్ స్పందిస్తూ ‘గత వారం బోనీ కపూర్‌ నుంచి తమకు నోటీసులు అందాయని .... దీనికి భయపడేది లేదని.. మేం దీనిని ఎదుర్కొంటామన్నారు. తమది సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం. శ్రీదేవి అన్నది సాధారణంగా అమ్మాయిలు పెట్టుకునే పేరేనని బోనీకి నచ్చజెప్పాను... నా సినిమాలో కథానాయిక పాత్ర పేరు శ్రీదేవి అని వివరణ ఇచ్చారు. 

వివాదాస్పద ‘శ్రీదేవి బంగ్లా’ ట్రైలర్ ఇదే....

 

Trending News