Viral Video: ఆవును కొట్టబోయిన వ్యక్తికి వింత అనుభవం.. ఎగిరి తన్నడంతో దెబ్బకు పేడలో!

Man and Cow Video Viral: తనను కొట్టడానికి వచ్చిన వ్యక్తిని ఒక ఆవు ఎగిరి తన్నిన వీడియో ఇప్పుదు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 8, 2022, 05:29 PM IST
Viral Video: ఆవును కొట్టబోయిన వ్యక్తికి వింత అనుభవం.. ఎగిరి తన్నడంతో దెబ్బకు పేడలో!

Man and Cow Video Viral: సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత పలు వీడియోలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా జంతువులకు సంబంధించిన ఎలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పెట్టినా సరే అవి వెంటనే వైరల్ అవుతాయి. నిజానికి కొంతమంది జంతువులను చాలా ప్రేమతో పెంచుకుంటూ ఉంటే మరి కొంతమంది మాత్రం వాటి మీద ఆధారపడి జీవిస్తున్నా సరే వాటిని ప్రేమగా చూసుకోకుండా వాటిని కొడుతూ హింసిస్తూ ఉంటారు,

తాజాగా వైరల్ అయిన వీడియోలో కూడా ఒక పశువుల దొడ్డిలో ఆవులను ఒక వ్యక్తి కొడుతూ కనిపించాడు. ఆవులను బెదిరించడానికి అతను కర్ర తీసుకుని కొట్టడానికి వెళుతున్న సమయంలో ఒక ఆవు దూడ పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి అతని గుండెల మీద తన్నగా అతను బొక్కబోర్లా పడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ దెబ్బకి సూట్ వేసుకున్న సదరు వ్యక్తి వెళ్లి పేడలో పడటం అదంతా తుడుచుకుంటూ పైకి లేవడం కూడా వీడియోలో కనిపిస్తోంది.

ఇక ఈ వీడియోని ఒక ట్విట్టర్ సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేసిన వెంటనే అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోకి ఇప్పటిదాకా సుమారు 37 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి అంటే ఇది ఎంతగా వైరల్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే వేలాది మంది ఈ వీడియోని లైక్ కూడా చేశారు.ముందుగా ఆవులను కర్రతో దారుణంగా కొడుతూ ఉండడంతో మిగతా ఆవులన్నీ బెదిరిపోతూ రావడంతో సదరు వ్యక్తి మీద ఆవు దూడ దాడి చేసిందని చెప్పచ్చు. 

Read Also: Constable Beaten: కానిస్టేబుల్ ను చితక్కొట్టిన జనం.. అసలు ఏమైందంటే?

Read Also: Viral Video: రెస్ట్ రూమ్‌కు వెళ్తున్నారా..తస్మాత్ జాగ్రత్త..ఎందుకో వీడియో చూడండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News