ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

అంతర్జాతీయంగా రికార్డులు బ్రేక్ చేసిన 'బాహుబలి' హీరో ప్రభాస్.. 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఐతే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. కానీ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారనే చర్చ ఫిల్మ్ నగర్ లో నెలకొంది.

Last Updated : Mar 2, 2020, 09:29 AM IST
  • అంతర్జాతీయంగా రికార్డులు బ్రేక్ చేసిన 'బాహుబలి' హీరో ప్రభాస్.. 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఐతే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. కానీ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారనే చర్చ ఫిల్మ్ నగర్ లో నెలకొంది.
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

అంతర్జాతీయంగా రికార్డులు బ్రేక్ చేసిన 'బాహుబలి' హీరో ప్రభాస్.. 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఐతే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. కానీ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారనే చర్చ ఫిల్మ్ నగర్ లో నెలకొంది. 

'బాహుబలి' సిరీస్ తర్వాత బిగ్ ప్రాజెక్టులకే యంగ్ రెబల్ స్టార్ ప్రభాన్ మొగ్గు చూపుతున్నాడు. 'బాహుబలి' తర్వాత వచ్చిన 'సాహో' డిజాస్టర్ గా నిలిచినప్పటికీ .. ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ప్రభాస్. . గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. లవ ఎంటర్ టైయినర్ జోనర్ లో వస్తున్న ఈ సినిమాకు 'ఓ డియర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 

ఐతే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానున్న ప్రభాస్ మూవీ.. 'ఓ డియర్' పూర్తయిన తర్వాతే సెట్స్ పైకి వెళ్తుందనే సమాచారం ఉంది.  మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ కోసం దర్శక నిర్మాతలు పలు పేర్లను పరిశీలిస్తున్నారు. భారీ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హిందీలో కూడా డబ్బింగ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. దీంతో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోణ్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ప్రభాస్ సరసన దీపికా పదుకోణ్ నటించనుంది. ఇప్పటికే కథ విన్న దీపికా పదుకోణ్. . తన నుంచి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే దీపికా పదుకోణ్.. నటించే తొలి తెలుగు చిత్రం ఇదే అవుతుంది. ప్రస్తుతం దీపికా.. '83' అనే సినిమాలో నటిస్తోంది. ప్రభాస్ నటిస్తున్న నాగ్ అశ్విన్  సినిమా సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కనుంది. 

Trending News