close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

కుందేటి కొమ్ము వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే

కుందేటి కొమ్ము పేరు ఎప్పుడైనా విన్నారా..? ఇదేదో నాన్ వెజ్ పేరు అనుకొనేరు? కానేకాదు.. ఆయుర్వేద వైద్యులు వాడే ఓ అరుదైన మొక్క ఇది. దీని పత్రాలు, వేర్లు వల్ల కలిగే ఉపయోగాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం. ఆంగ్లంలో కుందేటి కొమ్ము శాస్త్రీయ నామం కరొలెమా అడస్కాండెన్సిస్. ఈ రోజు మనం కూడా ఈ మొక్క వల్ల కలిగే మేలు ఏమిటో తెలుసుకుందాం..!

Updated: Oct 9, 2018, 04:43 PM IST
కుందేటి కొమ్ము వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే
Image Credit: Wikipedia

కుందేటి కొమ్ము పేరు ఎప్పుడైనా విన్నారా..? ఇదేదో నాన్ వెజ్ పేరు అనుకొనేరు? కానేకాదు.. ఆయుర్వేద వైద్యులు వాడే ఓ అరుదైన మొక్క ఇది. దీని పత్రాలు, వేర్లు వల్ల కలిగే ఉపయోగాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం. ఆంగ్లంలో కుందేటి కొమ్ము శాస్త్రీయ నామం కరొలెమా అడస్కాండెన్సిస్. ఈ రోజు మనం కూడా ఈ మొక్క వల్ల కలిగే మేలు ఏమిటో తెలుసుకుందాం..!

*ఆయుర్వేద వైద్యులు చాలామంది రోగుల కడుపు, ప్రేగుల్లో ఏర్పడే పుండ్ల నివారణకు కుందేటి కొమ్ము రసాన్ని తాగిస్తారని పలు గ్రంథాలు చెబుతున్నాయి.
*అలాగే ముసలితనం వల్ల వచ్చే ముడతలను కొంతవరకు నివారించడానికి కూడా కుందేటి కొమ్ము రసాన్ని తాగితే మంచిదని పలువురు వైద్యులు అంటున్నారు.
*స్థూలకాయ లక్షణాలు కనిపించిన ఎడల.. ఆ రుగ్మత బారి నుండి సాధ్యమైనంత త్వరగా బయటపడేందుకు కుందేటి కొమ్ము ఆకులను వేడినీటిలో మరగబెట్టి కషాయం చేసుకొని తాగాలన్నది కూడా పలువురి అభిప్రాయం.
*కుందేటి కొమ్ము కాకరకాయ మాదిరిగా చాలా చేదుగా ఉంటుంది. కానీ అనేక రుగ్మతలను నయం చేసే శక్తి దీనికి ఉందని పలు వైద్య గ్రంథాలు చెప్పడం విశేషం. 
*నేడు గిరిజన వైద్యులు చాలామంది పసరు తయారీ కోసం వాడే మొక్కల్లో కుందేటి కొమ్ముకు కూడా పెద్ద పీట వేస్తున్నారు.
*మధుమేహ వ్యాధి నివారణకు కూడా కుందేటి కొమ్ము పనికొస్తుందని చెబుతుంటారు.
*అయితే ఈ కుందేటి కొమ్ముతో తయారయ్యే ఔషధాలను పరిమితంగా వాడడంతో పాటు.. ఆయుర్వేద వైద్యుల సూచనల మేరకే వాడడం మంచిది. 
*కొన్ని వైద్య పద్ధతుల ప్రకారం, కుందేటి కొమ్ము రసాన్ని టీలో కూడా కలిపి సేవించవచ్చు. అలా చేయడం వల్ల కడుపులో మంట చల్లారుతుందట.
*జీర్ణశక్తి పెరగడానికి కూడా కుందేటి కొమ్ములను మిశ్రమంగా చేసి భుజించవచ్చు.