close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

ఐశ్వర్య రాయ్ సరికొత్త ప్రయోగం; విలన్ పాత్రకు గ్రీన్ సిగ్నల్ !!

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ సరికొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది

Updated: May 16, 2019, 03:11 PM IST
ఐశ్వర్య రాయ్ సరికొత్త ప్రయోగం; విలన్ పాత్రకు గ్రీన్ సిగ్నల్ !!

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక మూవీలో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ సరికొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో ప్రత్యేక క్యారెక్టర్ లో నటించనుంది. చోళ రాజుల కాలం నాటి కథతో సినిమాలో ఆమెకు నెగెటివ్ క్యారక్టర్ కు ఇస్తున్నట్లు తెలిసింది. ఈ పాత్రే కథను కీలక మలుపు తిప్పుతుందని తెలుస్తోంది.

విలన్ పాత్రకు ఐశ్వర్య గ్రీన్ సిగ్నల్...
నెగిటివ్ పాత్రలో నటించేందుకు ఐశ్వర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా ఈ మూవీలో ఐశ్యర్యతో పాటు విజయ్ సేతుపతి, జయం రవి, అనుష్క, కీర్తి సురేష్ నటించనున్నారు.మణిరత్నం ఈ మూవీని పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ కథను రూపొందిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.