సల్మాన్ ఖాన్‌ని చితకబాదితే.. 2 లక్షలు ఇస్తారట..!

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ని చితకబాదితే రూ.2 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామని ‘హిందూ హై ఆగే’ అనే సంస్థ బహిరంగంగా ప్రకటించింది.

Last Updated : Jun 2, 2018, 01:02 PM IST
సల్మాన్ ఖాన్‌ని చితకబాదితే.. 2 లక్షలు ఇస్తారట..!
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ని చితకబాదితే రూ.2 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామని ‘హిందూ హై ఆగే’ అనే సంస్థ బహిరంగంగా ప్రకటించింది. అయితే అందుకు ఓ కారణం కూడా ఉంది. సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్న ‘లవ్‌రాత్రి’ అనే సినిమా టైటిల్ పట్ల ఈ సంస్థ వారికి అభ్యంతరం ఉండడమే అందుకు ప్రధాన కారణం. 
 
ఈ టైటిల్ హిందువులు జరిపే దేవీ నవరాత్రులకు దగ్గరగా ఉందని.. అందుకే తమ మనోభావాలను కించపరిచిన సల్మాన్ ఖాన్‌ను కొట్టేవారికి భారీ స్థాయిలో నగదు నజరానా ఇవ్వాలని భావించామని ‘హిందూ హై ఆగే’  సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. అదేవిధంగా ఆ చిత్రంపై నిషేధం విధించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సల్మాన్ సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్దకు వెళ్లి పోస్టర్లను కూడా తగులబెట్టారు ఈ సంస్థ కార్యకర్తలు.
 
సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్న "లవ్ రాత్రి" చిత్రంలో ఆయుష్ శర్మ, వరీనా హుస్సేన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రెండు నెలల క్రితం ఈ చిత్రానికి సంబంధించిన పోస్టరు కూడా విడుదలైంది. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న ఆయుష్ శర్మ సల్మాన్ సోదరి అర్పితా ఖాన్‌కి భర్త కావడం గమనార్హం. వీరిద్దరూ 2014లో హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. 

Trending News