సల్మాన్ ఇక ప్రతీ ట్రిప్‌కి పర్మిషన్ తీసుకోవాల్సిందే..!

జింకల వేట కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు ప్రస్తుతం జోధ్‌పూర్ కోర్టు బెయిల్ అందించిన విషయం తెలిసిందే. 

Last Updated : Aug 5, 2018, 01:54 PM IST
సల్మాన్ ఇక ప్రతీ ట్రిప్‌కి పర్మిషన్ తీసుకోవాల్సిందే..!

జింకల వేట కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు ప్రస్తుతం జోధ్‌పూర్ కోర్టు బెయిల్ అందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే కోర్టు ఆయనకు పలు పరిమితులు విధిస్తున్నట్లు కూడా తెలియజేసింది. సల్మాన్ షూటింగ్‌ల నిమిత్తం ఏ ఇతర దేశానికి వెళ్లినా.. కోర్టు నుండి అనుమతి పొందాల్సిందేనని న్యాయస్థానం తెలియజేసింది. ఈ నియమాన్ని కచ్చితంగా సల్మాన్ పాటించాల్సిందేనని తెలిపింది.

జింకలను వేటాడి వధించిన కేసులో సల్మాన్ ఖాన్‌కి ఐదు సంవత్సరాల జైలుశిక్ష పడగా.. ఆయన తీర్పును సవాలు చేస్తూ మరల అపీల్ చేసుకున్నారు. ఆ తర్వాత బెయిల్ కూడా పొందారు. సల్మాన్ ఖాన్ తరఫున వాదిస్తున్న న్యాయవాదులు మాట్లాడుతూ.. తమ క్లైంట్ ఓ సినీ నటుడు కాబట్టి.. ఆయన తన ప్రొఫెషన్ చేసే డిమాండ్ బట్టి అప్పుడప్పుడు విదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

అయితే బెయిల్ పొందిన వ్యక్తులు విదేశాలకు వెళ్లడం చట్టరీత్యా సాధ్యం కాకపోవడంతో.. ఈ విషయమై స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సిందేనని కోర్టు తెలిపింది. సల్మాన్ ఫారిన్ ట్రిప్‌కు వెళ్లే ప్రతీసారి పర్మిషన్ తీసుకోవాలని కోర్టు తెలిపింది. 

అక్టోబరు 1, 1998 తేదిన జోధ్ పూర్ ప్రాంతంలోని కంకని గ్రామం వద్ద జింకలను వేటాడి చంపారన్న ఆరోపణలతో సల్మాన్ ఖాన్ పై కేసు నమోదైంది. హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ గ్రామాన్ని చిత్ర యూనిట్ సందర్శించగా.. అదే ఊరి శివార్లలో ఈ ఘటన జరిగింది. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం "భారత్" చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.

Trending News