ఛాన్సిస్తే .. అంతా ఊడ్చేస్తా.. అంటోంది ఆ స్టార్ హీరోయిన్. ఇప్పుడు ఆమె చీపురు పట్టి ఊడుస్తున్న వీడియో వైరల్ గా మారింది. నిజానికి స్వచ్ఛభారత్ మిషన్ ను ప్రచారం చేసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు అంతా చీపుర్లు పట్టారు. వీలైనంత వరకు పరిశుభ్రతను ప్రచారం చేసేందుకు తమదైన శైలిలో రోడ్లపై చెత్తను శుభ్రం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సుద్దులు వల్లించారు. ఐతే ఇప్పుడు ఆ స్టార్ హీరోయిన్ కూడా అదే పని చేసింది. కాకపోతే సినిమా షూటింగ్ లో చేసింది. ఆమె ఎవరో కాదు.. కత్తిలాంటి కత్రినా కైఫ్. తెలుగులో 'మల్లీశ్వరీ' సినిమాతో తెరంగేట్రం చేసిన మనల్ని ఆకట్టుకున్న కత్రినా కైఫ్... ఇప్పుడు చీపురు పట్టింది. తాజాగా ఆమె సూర్యవంశి అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. అందుకు సంబంధించిన సెట్ లో చీపురు పట్టి ఊడ్చేసింది బాలీవుడ్ బ్యూటీ. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Spotted : The newest #SwachhBharat brand ambassador on the sets of #Sooryavanshi 😬 #BTS pic.twitter.com/NpzQJUaKLw
— Akshay Kumar (@akshaykumar) February 3, 2020
వీడీయోను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ట్విట్టర్ లో షేర్ చేశారు. కత్రినా కైఫ్ ను కొత్త స్వచ్ఛ భారత్ అంబాసిడర్ గా అభివర్ణించారు. ఈ వీడియోను హీరో అక్షయ్ కుమార్ తీయడం విశేషం. వీడియోలో కత్రినా కైఫ్ ఊడుస్తూ కనిపిస్తోంది. ఏం చేస్తున్నావని అక్షయ్ ప్రశ్నించగా.. కత్రినా కైఫ్.. సఫాయి అంటూ సమాధానం ఇవ్వడం వీడియోలో చూడవచ్చు.