నచ్చిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలు పంచుకుని సంబరాలు చేసుకునే ప్రస్తుత ట్రెండ్‌కి అనుగుణంగా ఎల్జీ మొబైల్స్ మేకర్స్ తాజాగా ఓ సరికొత్త స్మార్ట్ ఫోన్‌తో వినియోగదారుల ముందుకొస్తున్నారు. LG V40 ThinQ పేరిట దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రవేశపెడుతున్న ఈ స్మార్ట్ ఫోన్లో ఫోటోలు, వీడియోలు మిక్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే సౌకర్యం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లోని మేజిక్ టూల్ ఫీచర్‌ని ఉపయోగించుకుని ఒక ఫోటోలోని ఏదైనా ఒక భాగంలో నచ్చిన వీడియోను జత చేసి, ఆ తర్వాత ఫైనల్ ఔట్‌పుట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవచ్చని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తెలిపినట్టుగా యొన్హాప్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ మేజిక్ టూల్ ద్వారా రూపొందించిన ఫోటోల్లో ఉట్టిపడే సహజత్వం నిజ జీవితంలోనూ కనిపించదని సంస్థ తెలిపింది.
రేపే మార్కెట్లోకి విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్స్‌కి 5 కెమెరాలు ఉండనున్నట్టు ఇప్పటికే కంపెనీ ఓ ప్రకటనలో స్పష్టంచేసింది. అందులో వెనుక ఉండే కెమెరాల్లో స్టాండర్స్, వైడ్-యాంగిల్, టెలిఫోటో లెన్సెస్ ఉపయోగించినట్టు కంపెనీ వెల్లడించింది.