మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్‌లో ఆడనున్న తొలి సినిమా ఇదేనట

మల్టీప్లెక్స్ థియేటర్‌ బిజినెస్‌లోకి మహేష్ బాబు

Last Updated : Oct 28, 2018, 07:35 PM IST
మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్‌లో ఆడనున్న తొలి సినిమా ఇదేనట

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే ఫిలిం ఎగ్జిబిషన్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నట్టుగా టాలీవుడ్‌లో ఇటీవల ఓ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకోసం మహేష్ బాబు ఓ మల్టీప్లెక్స్ థియేటర్‌కి యజమాని అవుతున్నాడనేది ఆ ప్రచారం సారాంశం. అయితే, తాజాగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబుకి చెందిన ఏఎంబీ సినిమాస్ ఈ నవంబర్ 8న ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ మొదటిసారి కలిసి నటించగా, కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమానే మహేష్ బాబు స్థాపించిన ఏఎంబీ సినిమాస్‌లో ఆడనున్న తొలి సినిమా అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.   

దేశంలోని పెద్ద పెద్ద నగరాల్లో మల్టీప్లెక్సులున్న ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి మహేష్ బాబు గచ్చిబౌలిలో ఏఎంబీ మల్టిప్లెక్స్ థియేటర్‌ని నిర్మించినట్టు సమాచారం. అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆడియెన్స్‌కి ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఇచ్చే విధంగా నిర్మించిన ఈ మల్టీప్లెక్స్‌లో సినిమాను ఎంజాయ్ చేయాలంటే నవంబర్ 8వ తేదీ వరకు వేచిచూడాల్సిందే మరి. 

Trending News