మంచు విష్ణు రోడ్డు యాక్సిడెంట్ వీడియో వైరల్

టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు ఈ మధ్యకాలంలో ఓ రోడ్డు ప్రమాదంలో గాయలైన సంగతి తెలిసిందే.

Last Updated : Apr 25, 2018, 10:59 PM IST
మంచు విష్ణు రోడ్డు యాక్సిడెంట్ వీడియో వైరల్

టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు ఈ మధ్యకాలంలో ఓ రోడ్డు ప్రమాదంలో గాయలైన సంగతి తెలిసిందే.  ‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగ్‌లో ఆ ప్రమాదం జరిగింది. జి. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను హీరోయిన్  ప్రగ్యా జైశ్వాల్‌‌తో పాటు విష్ణు మీద మలేషియాలో చిత్రీకరించారు.అలా చిత్రీకరణ జరుపుకున్న సీన్స్‌లో పలు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి.

అలాంటి ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడే అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల ఆయన, హీరోయిన్‌తో సహా బైక్ పై నుండి జారి కిందపడ్డారు . ఇదే  ప్రమాదంలో విష్ణుకి బాగా గాయాలయ్యాయి. కాలికి, భుజానికి ఆయన చికిత్స కూడా చేయించుకున్నారు. అయితే ఆయనతో పాటు బైక్ నుండి కింద పడిన కథానాయిక ప్రగ్యా మాత్రం చాలా తక్కువ గాయాలతో బయటపడడం గమనార్హం

ఇటీవలే ఈ యాక్సిండెంట్‌కి సంబంధించిన యూట్యూబ్ వీడియాను మంచు విష్ణు తన ట్విటర్‌ ఖాతా ద్వారా పంచుకున్నారు. ‘స్టంట్స్‌ ఎప్పుడూ సేఫ్ కాదు. ఈ స్టంట్ వల్ల నిజంగానే నా తల పగిలి ఉండేది’ అని విష్ణు ట్వీట్‌ ద్వారా తన అభిమానులకు తెలిపారు.

యాక్షన్ సన్నివేశంలో భాగంగా విష్ణు బైక్‌ను‌ తరుముకొస్తున్న ఓ బైక్... హీరో బైక్‌పై పడటంతో ఈ ప్రమాదం అనేది జరిగింది. పద్మజా పిక్చర్స్‌ బ్యానర్ పై నిర్మితమైన ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం ఏప్రిల్ 27వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. 

Trending News