మా అసోషియేషన్ లో ఫ్రీ మెంబర్ షిప్ ఇవ్వాలని నటి శ్రీరెడ్డి చేసిన డిమాండ్ పై మా అసోషియేషన్ సభ్యుడు, మెగా ఫ్యామిలీ మెంబర్ నాగబాబు స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా అసోషియేషన్ లో సభ్యత్వం అనేది ఎగ్జిక్యూటివ్ బాడీ నిర్ణయం తీసుకోవాలి. ఇందులో సభ్యత్వం అనేది అనేక నియమ నిబంధనలకు లోబడి ఇస్తారు. ఇందులో ఫ్రీ మెంబర్ షిప్ సాధ్యం కాదు. ఎందుకుంటే మా అసోషియేషన్ అనేక క్యార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. సభ్యులకు సబ్సీడీ ఇచ్చి మెడిక్లైం సదుపాయం ఇవ్వాల్సి ఉంది. వయసు మీదపడిన ఆర్టిస్టులకు నెలకు రూ.3 వేల చొప్పున ఫించన్లు ఇస్తున్నాం. దీనికి తోడు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంది. అందుకే ప్రాధమిక సభ్యత్వం ఫీజు లక్ష రూపాయలు పెట్టాం. ఇందులో ఫ్రీ మెంబర్ షిప్ కు అవకాశం లేదు.
సినీ ఇండస్ట్రీలో 10 శాతం వెదవలున్నారు..
తెలుగు సినీ ఇండస్ట్రీలో మహిళా వేధింపులపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై నాగబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినీమా ఇండస్ట్రీలో 10 శాతం వెదవలు ఉన్నాది వాస్తవం ..అలాగని అందరినీ తప్పుబట్టడం సరికాదు. ఇంత పెద్ద సినీ ఇండస్ట్రీలో ఎవడో ఒక వెదవ తప్పు చేస్తే.. అందరిపై వేలెత్తి చూపడం తగదు. ఆడవాళ్లపై లైంగిక వేధింపులకు తాను పూర్తి వ్యతిరేకమన్నారు. ఇవరైనా లేడీ ఆర్టిస్టులను వేదిస్తే చెప్పుతీసుకొని కొట్టాలని సూచించారు. అదే సమయంలో మా అసోషియేషన్ కు ఫిర్యాదు చేయవచ్చు..దీనికి తోడు పోలీసు , న్యాయవ్యవస్థ ఆశ్రయించవచ్చు. ఈ రోజు ఆడవాళ్ల భద్రత కోసం అనేక చట్టాలున్నాయి. ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టాలను ఆశ్రయించవచ్చు. వేధింపులకు గురైన వారు ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయలేదంటే అది వారి అవగాహన లోపం. ఇన్ని అవకాశాలు ఉండి కూడా వాటిని ఉపయోగించుకోకుండా రోడ్డెక్కి మా అసోషియేషన్ పై అసత్య అరోపణలు చేయడం తగదని శ్రీరెడ్డి ఉద్దేశించి నాగబాబు పరోక్షంగా మందలించారు.