మెగాస్టార్ అల్లుడి సినిమాలో కిరాక్ లాంటి "కోడి" పాట ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న చిత్రం పేరే "విజేత". 

Last Updated : Jun 23, 2018, 07:20 PM IST
మెగాస్టార్ అల్లుడి సినిమాలో కిరాక్ లాంటి "కోడి" పాట ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న చిత్రం పేరే "విజేత". ఈ రోజు ఉదయం 8 గంటలకు ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేశారు. దాంతో పాటు ఓ పోస్టర్  కూడా విడుదల చేశారు."కోడికి సంతాపం" అనే పేరుతో రూపొందిన ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్‌గా మారింది. "కొక్కొరొకో" పేరుతో సాగిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే హల్చల్ చేస్తోంది.

రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "విజేత" చిత్రాన్ని వారాహి బ్యానరులో రజనీ కొర్రపాటి నిర్మిస్తుండగా.. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక నాయర్, మురళీ శర్మ ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వైవిధ్యమైన లిరిక్స్ అందించిన రామజోగయ్య శాస్త్రి గారికి మంచి క్రెడిటే ఇస్తున్నారు కొందరు మెగా అభిమానులు.

చాలా వెరైటీగా సాగే ఆ చికెన్ పాట చరణాలు మీకోసం..!
చిల్లి చికెనూ..కడాయి చికెనూ.. గ్రిల్డ్ చికెనూ..మోఘలాయి చికెనూ..చికెన్ రోస్టు.. చికెన్ కర్రీ..చికెన్ టిక్కా.. చికెన్ మంచూరియా.. చికెన్ తందూరి.. చికెన్ పికెల్.. హలీము.. నషాలం జివ్వుమనిపించే నాటుకోడి పులుసు..ఎన్నెన్ని రూపాలు.. ఎన్నెన్ని వేషాలు..ఎన్నెన్ని అవతారాలే నీకు.. చికెన్ తల్లీ..ఆదివారమొస్తే గుర్తొస్తావు.. లెగ్గు  పీసు నాదంటే నాదని నోరూరిస్తుంటావు. కుండలో ఉడుకుతావు.. బొంగులో ఉడుకుతావు..కేఎఫ్సీ బకెట్టులో దొరుకుతావు.. బఫెలో వింగ్స్‌తో కడుపు నింపుతావు. మాకు బలానిచ్చి బలి అవుతావు.. శ్రద్ధాంజలి నీకు..

ఆల్ మై చికెన్ లవర్స్.. లిసెన్ టుది స్టోరీ ఆఫ్ ది శాడ్ చికెన్. కొక్కొరొకో.. లిక్కరోకో.. ముక్కరోకో.. ఓసి పిట్టా పిట్టా కోడి.. భలే దిట్టంగున్నావు కోడి.. ముస్తాబులతో మసాలా నీది.. అదిరిందే బంపరు బాడీ నీది.. ఏ నిన్ను పెంచినోడు ఎవడో.. కోసి తినేది ఎవడో.. అంటూ సాగిన ఈ పాట ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. సింగర్ లోకేశ్వర్ పాడిన ఈ వెరైటీ పాట ఇంటర్నెట్ లో బాగానే సందడి కూడా చేస్తుంది. 

Trending News