/telugu/photo-gallery/tspsc-group-4-final-result-2024-category-wise-selected-candidates-list-check-full-details-here-rn-180895 TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. 180895

'కరోనా వైరస్' కారణంగా లాక్ డౌన్ విధించడంతో స్కూళ్లు, షాపింగ్ మాళ్లు, థియేటర్లు అన్నీ మూతపడ్డాయి. ఐతే ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి తెరుచుకుంటున్నాయి. కానీ సినిమా థియేటర్లు మాత్రం ఇప్పటికీ  తెరుచుకోలేదు.

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా షూటింగులు కూడా బంద్ అయ్యాయి. ఇటు సినిమా థియేటర్లు తెరుచుకోని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో  తెలుగు చిత్ర పరిశ్రమ భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తాము చాలా నష్టపోతున్నామని ఆయా సినీ నిర్మాతలు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. 

మరోవైపు సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభిస్తే .. కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇటు సినిమా నిర్మాతలు భారీ నష్టాల నుంచి బయటపడేందుకు ఆన్ లైన్ సినిమా ..OTT వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో అటు థియేటర్ల యాజమాన్యాల్లో గుబులు నెలకొంది. OTTపై సినిమాలు విడుదల చేస్తే.. తాము పూర్తిగా నష్టపోతామని థియేటర్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్  ప్రముఖ నటుడు చిరంజీవి ఇంట్లో సినీ పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, సి.కళ్యాణ్, దిల్ రాజు, జెమిని కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకులు రాజమౌళి, వి. వినాయక్,  త్రివిక్రమ్ శ్రీనివాస్, N.శంకర్, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం సినిమా థియేటర్లను పునః ప్రారంభంచే విషయాలపై చర్చించారు.  

సమావేశంలో అందరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం కానున్నారు. ఆ తర్వాత సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Section: 
English Title: 
minister Talasani srinivas yadav meets tollywood producers and artists in chiranjeevi house
News Source: 
Home Title: 

థియేటర్ల పునః ప్రారంభం ఎలా..?

థియేటర్ల పునః ప్రారంభం ఎలా..?
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
థియేటర్ల పునః ప్రారంభం ఎలా..?
Publish Later: 
No
Publish At: 
Thursday, May 21, 2020 - 12:15