జయహో... జూనియర్ మోడీ

అచ్చం తనలాగే వేషం వేసుకొని, హావభావాలను వ్యక్తం చేసిన ఆ బాలుడిని చూసి మురిసిపోయారు భారత ప్రధాని.

Last Updated : Nov 30, 2017, 11:34 AM IST
జయహో... జూనియర్ మోడీ

గుజరాత్ రాష్ట్రంలోని నవసరి పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగించేందుకు వచ్చిన నరేంద్ర మోడీ, తన వేషధారణలో ఉన్న ఓ చిన్నబాలుడిని చూసి ఆశ్చర్యపోయారు. ఆ బాలుడిని వేదికపైకి పిలిపించి కొంచెం సేపు ముచ్చటించారు. కుశల ప్రశ్నలు వేశారు. అచ్చం తనలాగే వేషం వేసుకొని, హావభావాలను వ్యక్తం చేసిన ఆ బాలుడిని చూసి మురిసిపోయారు భారత ప్రధాని.

తర్వాత తనలాగే మణికట్టుకు నల్లటి దారాలు కట్టుకున్న ఈ బాలుడిని ఒళ్లో కూర్చోబెట్టుకొని అభినందించారు. అనంతరం ‘‘చూడండి.. అచ్చం ఈ బాలుడు నాలాగే ఉన్నాడు.. మీరెవరైనా ఇష్టపడుతున్నారా’’ అని తన ట్విటర్ పేజీలో కూడా ట్వీట్ చేశారు మోడీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాతో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా బాగా హల్చల్ చేస్తోంది. 

 

Trending News