నడుము నొప్పి వచ్చిందంటే చాలు. పెయిన్ కిల్లర్స్, నొప్పి నివారణ కొరకు మందులు వాడడం నేడు అధికమైపోయింది. ఈ క్రమంలో వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్‌లను గురించి పట్టించుకోవడం లేదు. అయితే అలాంటి ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన పని లేకుండానే కింద ఇచ్చిన కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే చాలు. నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు.
* ఒక కప్పు పాలలో తేనె వేసుకొని రోజూ తాగడం వల్ల నడుము నొప్పి రాకుండా చూసుకోవచ్చు.
* నొప్పిగా ఉన్న ప్రదేశంలో ఐస్ ముక్కతో కాపడం పెట్టడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
* తెల్ల చామంతి పూలతో చేసిన కషాయంతో నడుము నొప్పిని తగ్గించవచ్చు.
* రెండు కప్పుల నీటిలో చిన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసి, ఒక కప్పు అయ్యే వరకూ మరిగించాలి. వడగట్టి, చల్లార్చిన తర్వాత తేనె కలుపుకొని తాగితే నడుము నొప్పి తగ్గిపోతుంది.
* నొప్పి ఉన్న చోట అల్లం పేస్ట్‌ను కాసేపు ఉంచినా మంచి ఫలితం ఉంటుంది.
* రెండు చెంచాల గసగసాల పొడిని గ్లాసు పాలలో కలుపుకొని రోజుకు రెండుసార్లు తాగినా నొప్పి తగ్గుతుంది.