ఎన్.టి.ఆర్ మహానాయకుడు ట్రైలర్

ఎన్.టి.ఆర్ మహానాయకుడు ట్రైలర్

Last Updated : Feb 16, 2019, 09:47 PM IST
ఎన్.టి.ఆర్ మహానాయకుడు ట్రైలర్

దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్.టి.ఆర్ చిత్రం కథా నాయకుడు, మహా నాయకుడు పేరిట రెండు భాగాలుగా ఆడియెన్స్ ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కథా నాయకుడు మూవీ సంక్రాంతి బరిలో నిలిచి హిట్ టాక్ సొంతం చేసుకోగా ఫిబ్రవరి 22న మహానాయకుడు మూవీ సైతం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటించగా ఆయన సతీమణి పాత్రలో విద్యాబాలన్ నటించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, రానా ద‌గ్గుపాటి, సుమంత్ తదితరలు ఈ చిత్రంలో ఇతర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఎన్.టి.ఆర్ మహా నాయకుడు మూవీ విడుదలకు తేదీ సమీపిస్తున్న తరుణంలో తాజాగా చిత్ర నిర్మాతలు సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఎన్.టి.ఆర్ కథా నాయకుడులో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని చూపించిన మేకర్స్.. ఎన్.టి.ఆర్ మహానాయకుడు ద్వారా సినిమా ఎన్.టి.ఆర్ హీరో నుంచి మహా నేతకు ఎలా ఎదిగారు అనే అంశాలను చూపించనున్నారు. ముఖ్యంగా ఆయన రాజకీయ చరిత్ర, రాజకీయ జీవితంలో ఎదురైన ముఖ్యమైన ఘట్టాలను ఈ రెండో భాగంలో ప్రస్తావించనున్నారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఎన్.టి.ఆర్ మహానాయకుడు మూవీకి సెన్సార్ బోర్డ్ క్లీన్ 'యూ' సర్టిఫికెట్ జారీ చేశారు.

Trending News