Pawan Kalyan: పవన్ రాజకీయాల దెబ్బకు టెన్షన్లో డైరెక్టర్స్.. ఫైనల్లీ గుడ్ న్యూస్!

Pawan Kalyan Directors are in trouble: పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల మీద ద్రుష్టి పెడుతున్న క్రమంలో ఆయన దర్శకులు ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 26, 2022, 03:45 PM IST
Pawan Kalyan: పవన్ రాజకీయాల దెబ్బకు టెన్షన్లో డైరెక్టర్స్.. ఫైనల్లీ గుడ్ న్యూస్!

Pawan Kalyan Directors are in trouble: చివరిగా భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క సినిమాలు కూడా చేస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్లాక పూర్తిగా సినిమాలకు దూరమవుతానని చెప్పిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో దారుణంగా మొదటి ప్రయత్నం విఫలం కావడంతో వెంటనే వరుస సినిమాలు అనౌన్స్ చేశారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్లానింగ్ లేమి కారణంగా ఆయనతో సినిమాలు చేయాల్సిన దర్శకుల షెడ్యూల్స్ అన్ని తారుమారయి ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.

వారంతా తమ కెరీర్ ని పణంగా పెట్టి పవన్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయని అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాలు ప్రకటించిన దర్శకుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది అని అంటున్నారు. ఆయన క్రిష్ దర్శకత్వంలో ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలు చేయడం అవి క్రిష్ కి నచ్చకపోవడంతో చాలా కాలం నుంచి షూటింగ్ ఆగిపోయింది. ఎట్టకేలకు సంధి కుదిర్చారని త్వరలోనే షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే గద్దల కొండ గణేష్ అంటూ 2019వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హరీష్ శంకర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నానని ప్రకటించారు. టైటిల్ ప్రకటన కూడా చేసిన తర్వాత ఆ సినిమాలో పట్టాలు ఎప్పుడు ఎక్కుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయన మరో సినిమా చేసుకునే పరిస్థితుల్లో హీరోను వెతుక్కుంటున్నాడని అంటున్నారు. మరోదర్శకుడు సురేందర్ రెడ్డి అఖిల్ తో ఏజెంట్ అనే సినిమా తీశాడు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాల్సి ఉంది.

అయితే ఇప్పుడు అసలు ఆ సినిమా ప్రారంభమవుతుందో లేదో తెలియని పరిస్థితులలో ఆయన మరో కుర్ర హీరోని కూడా పట్టుకున్నారని అంటున్నారు. ఇలా ఇంత మంది దర్శకులు ఇబ్బంది పడుతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం వాళ్లందరినీ పక్కన పెట్టి ఒక తమిళ రీమేక్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కూడా ఈ నెల ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అది కూడా వాయిదా పడింది అని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యి కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న నేపథ్యంలో ఆయనతో సినిమాలు ప్లాన్ చేసుకున్న దర్శకనిర్మాతల పరిస్థితి దారుణంగా మారిందని అంటున్నారు. అయితే హరిహర వీరమల్లు ఇబ్బందులు తొలిగాయి కాబట్టి ఆ షూటింగ్ మొదలు పెడితే మిగతా సినిమాల షూటింగ్ లు కూడా పూర్తి చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది. 

Read Also: Nandamuri Balakrishna: బాలకృష్ణ వీడియోలు బయటకు.. బాబు బంగారం అంటూ పండుగ చేసుకుంటున్న ఫాన్స్

Read Also: Vijay Devarakonda: ఒకేసారి ఇద్దరితో శృంగారానికి రెడీ.. కరణ్ షోలో విజయ్ బోల్డ్ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News