పవన్ కల్యాణ్, రాంచరణ్ కాంబోలో సినిమా ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ల కాంబోలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు గతంలో అనేక సందర్భాల్లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

Last Updated : Jun 22, 2019, 01:41 PM IST
పవన్ కల్యాణ్, రాంచరణ్ కాంబోలో సినిమా ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ల కాంబోలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు గతంలో అనేక సందర్భాల్లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వార్తలన్నీ పుకార్లగానే మిగిలిపోవడం, ఆ తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయాలతో బిజీ అయిపోవడంతో ఆ తర్వాత అభిమానులు సైతం ఆ విషయాన్ని అంతటితోనే మర్చిపోయారు.

ఇదిలావుండగా, తాజాగా మరోసారి పవన్ కల్యాణ్, రాంచరణ్‌ల సినిమాకు సంబంధించిన వార్తలు తెరపైకొచ్చాయి. పవన్ కల్యాణ్ తన సొంత నిర్మాణ సంస్థ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రాంచరణ్ హీరోగా ఓ సినిమా నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడని, 2020లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయనేది ఆ వార్తల సారాంశం. అంతేకాకుండా.. ఈ సినిమా కోసం ఓ కథను సిద్ధం చేయాల్సిందిగా పవన్ తన సన్నిహితమిత్రుడు త్రివిక్రమ్‌కి చెప్పిపెట్టారట. ఒకవేళ అదే కానీ నిజమైతే, ఆ ఇద్దరు హీరోల అభిమానుల ఆనందానికి ఇక అంతే ఉండదేమో!!

Trending News