భార్యాబిడ్డలతో కలిసి మెగాస్టార్ ఇంటికి వచ్చిన పవర్ స్టార్

జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్, తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి సతీసమేతంగా వెళ్లారు. 

Last Updated : Aug 22, 2018, 09:16 PM IST
భార్యాబిడ్డలతో కలిసి మెగాస్టార్ ఇంటికి వచ్చిన పవర్ స్టార్

జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్, తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి సతీసమేతంగా వెళ్లారు. పుష్ప గుచ్ఛాన్ని తన సోదరుడికి అందించి.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత ఆయనతో కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుతూ గడిపారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవాతో పాటు తన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

తన అన్న మీద ప్రేమతో తన కుమారుడికి పవన్ మార్క్‌ శంకర్‌ పవనోవిచ్ అని పేరు పెట్టిన సంగతి మనకు తెలిసిందే. "మార్క్‌ శంకర్‌ పవనోవిచ్" పేరుతో శంకర్ అనే పదాన్ని పవన్ కళ్యాణ్, చిరంజీవి అసలు పేరైన శివశంకర్ వరప్రసాద్ నుండి తీసుకున్నారు. ఈ రోజు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి అనేకమంది చలన చిత్ర ప్రముఖులు, వందలాది అభిమానులు వచ్చారు. వారినందరినీ చిరంజీవి చాలా ఆప్యాయంగా పలకరించారు. చిరంజీవి ప్రస్తుతం తన కుమారుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న "సైరా నరసింహారెడ్డి" చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్‌లో అనేకమంది చలన చిత్ర ప్రముఖులు అభినందలు తెలిపారు. శ్రీకాంత్, అల్లు అర్జున్, నాగార్జున, నారా లోకేష్, కాజల్ అగర్వాల్, నరేష్, దగ్గుబాటి వెంకటేష్ మొదలైన వారందరూ కూడా శుభాకాంక్షలు తెలిపారు. 

Trending News