సూపర్ స్టార్ 'పేట' తెలుగు ట్రైలర్ సూపర్

ఆకట్టుకునే డైలాగ్స్‌తో విడుదలైన పేట మూవీ తెలుగు ట్రైలర్ 

Last Updated : Jan 2, 2019, 01:43 PM IST
సూపర్ స్టార్ 'పేట' తెలుగు ట్రైలర్ సూపర్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం పేట. కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఈ సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు రానుంది. విజయ్ సేతుపతి, త్రిష, సిమ్రాన్, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, శశి కుమార్, బాబీ సింహ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను నిర్మిస్తున్న సన్ టీవీ నెట్‌వర్క్ అభిమానులకు న్యూఇయర్ కానుకగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇటీవలే విడుదలైన తమిళ ట్రైలర్‌కి భారీ స్పందనే కనిపించగా తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ సైతం సూపర్ డైలాగ్స్‌తో ఆకట్టుకుంటుంది. పేట సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోయిజానికి తగినట్టుండే సన్నివేశాలు పుష్కలంగా వున్నాయని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మొత్తంగా అటు తమిళంలోనైనా ఇటు తెలుగులోనైనా రజినీ మార్క్ హీరోయిజం నచ్చే అభిమానులకు పేట సినిమా ఈ సంక్రాంతికి మాంచి వినోదాన్ని అందించనుందన్నమాట. 

Also read : రజినీకాంత్ నటించిన పేట తెలుగు ట్రైలర్ స్నీక్ పీక్ వీడియో

Trending News