ఆ విషయంలో కేసీఆర్ ఎంతో గ్రేట్ : పోసాని కృష్ణమురళి

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఆకాశానికెత్తేశారు. 

Last Updated : Mar 22, 2018, 12:31 AM IST
ఆ విషయంలో కేసీఆర్ ఎంతో గ్రేట్ : పోసాని కృష్ణమురళి

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఆకాశానికెత్తేశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సినీ ప్రముఖులపై విమర్శలు చేస్తున్నవాళ్లు ఎవ్వరూ తెలంగాణ సీఎం కేసీఆర్ కాలిగోటికి కూడా పనికిరారు అంటూ సినీ పరిశ్రమను విమర్శించిన వారిపై పోసాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. " తెలంగాణ కోసం కేసీఆర్ చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. మంచికో చెడుకో తెలంగాణ కోసం అవసరమైతే, గొంగలి పురుగును కూడా ముద్దాడతానన్న కేసీఆర్ నికార్సైన లీడర్ " అని ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు పోసాని. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో అన్ని రాజకీయపక్షాలు కేంద్రంతో పోరాడుతోంటే సినీ పరిశ్రమ మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది అని పలువురు చేస్తోన్న ఆరోపణలపై స్పందిస్తూ పోసాని ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇదిలావుంటే, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్ని అనిశ్చితి గురించి స్పందిస్తూ మంగళవారం మీడియాతో మాట్లాడిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సినీ పరిశ్రమకు చెందిన వారిపై ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు సమస్యల్లో వున్నప్పుడు ఆ రాష్ట్రానికి చెందిన సినిమా ఆర్టిస్టులు అంతా ఏకమై పోరాటం చేశారని చెబుతూ తెలుగు సినిమా వాళ్లు కూడా తమిళ సినీ ప్రముఖులని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా వుందని మండిపడ్డారు. 

రాజేంద్ర ప్రసాద్ సినీ ప్రముఖులపై ఇలా ఘాటు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే పోసాని కృష్ణమురళి ఎవ్వరి పేరు ఎత్తకుండా ఇలా పరోక్షంగా స్పందించడం చూస్తోంటే, ఈ రెండు ఘటనలకు సంబంధం వున్నట్టు కనిపిస్తోంది అని సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి.  

Trending News