మహేష్ బాబుతో కలిసి నటించనున్న రణ్‌వీర్ సింగ్

ఆసక్తినిరేపుతున్న మహేష్ బాబు-రణ్ వీర్ సింగ్ కాంబినేషన్

Last Updated : Jul 30, 2018, 06:19 PM IST
మహేష్ బాబుతో కలిసి నటించనున్న రణ్‌వీర్ సింగ్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరూ కలిసి నటించబోతున్నారనే వార్త ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే, ఆ ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తోంది మాత్రం సినిమాలో కాదండోయ్! అవును, ఓ ప్రముఖ కూల్ డ్రింక్ వ్యాపార సంస్థ రూపొందిస్తున్న వాణిజ్య ప్రకటనలో రణ్‌వీర్ సింగ్, మహేష్ బాబు కలిసి నటిస్తున్నారు. కోకాకోలా సంస్థ తమ ప్రోడక్ట్స్ అమ్మకాలను పెంచుకోవడం కోసం చేయిస్తున్న వాణిజ్య ప్రకటనలో ఈ ఇద్దరూ కలిసి తెరను పంచుకుంటున్నారు.

కోకాకోలా తయారు చేస్తోన్న ఓ కూల్ డ్రింక్‌కి ఇప్పటికే ఈ ఇద్దరూ వేర్వేరుగా బ్రాండ్ అంబాసిడర్స్‌గా కొనసాగుతున్నారు. అయితే, వీళ్లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ ఇద్దరినీ కలిపి ఓ యాడ్ చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు దృశ్యరూపమే మహేష్, రణ్‌వీర్‌లు కలిసి నటిస్తున్న యాడ్. బాలీవుడ్‌లో ఓ పేరున్న సినీ దర్శకుడు డైరెక్ట్ చేయనున్న ఈ యాడ్ షూటింగ్‌ను త్వరలోనే విదేశాల్లో చిత్రీకరించనున్నారు. 

ఇక రణ్‌వీర్ సింగ్ సినిమా కెరీర్ విషయానికొస్తే, తెలుగులో సూపర్ హిట్ అయిన టెంపర్ సినిమా హిందీ రీమేక్‌తో అతడు బిజీగా ఉండగా మహేష్ బాబు తన కెరీర్‌లో 25వ సినిమాతో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఓ విభిన్నమైన లుక్‌తో కనిపించనున్నాడు.

Trending News