RBI Imposes Penalties on Banks: రూల్స్ బ్రేక్ చేసిన 3 బ్యాంకులు.. కొరడా జులిపించిన ఆర్‌బీఐ!

RBI Penalty on these 3 Banks: నిబంధనలు ఉల్లంఘించిన జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్ బ్యాంక్‌లపై ఆర్‌బీఐ కఠిన చర్యలు తీసుకుంది. మూడు బ్యాంక్‌లపై భారీ జరిమానా విధించింది. ఏ బ్యాంక్‌పై ఎంత జరిమానా పడింది..? ఎందుకు విధించింది..? వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 26, 2023, 08:05 PM IST
RBI Imposes Penalties on Banks: రూల్స్ బ్రేక్ చేసిన 3 బ్యాంకులు.. కొరడా జులిపించిన ఆర్‌బీఐ!

Reserve Bank of India Imposes Penalties on Axis, Jammu and Kashmir Bank and Bank of Maharashtra: రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆదేశాలను పాటించనందుకు జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్ బ్యాంక్‌లపై భారీ జరిమానా పడింది. కొన్ని నిబంధనలు పాటించనందుకు జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ రూ.2.5 కోట్ల పెనాల్టీని విధించింది. రుణాలు, అడ్వాన్సులు, అలాగే చట్టబద్ధమైన ఇతర పరిమితులు, సెంట్రల్ రిపోజిటరీపై ఆర్‌బీఐ మార్గదర్శకాలను పాటించడంలో బ్యాంక్ విఫలమైంది. అదేవిధంగా స్వీఫ్ట్ సంబంధిత కార్యాచరణ నియంత్రణలను సకాలంలో అమలు చేయలేదు. 2021 మార్చి 31న నిర్వహించిన ఆర్‌బీఐ చట్టబద్ధమైన తనిఖీలో ఈ ఆదేశాలు పాటించడం లేదని వెల్లడైంది. దీంతో రూ.2.5 కోట్ల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 

అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు కూడా రూ.1.45 కోట్ల జరిమానా విధించింది రిజర్వ్ బ్యాంక్. నిర్దిష్ట ఆదేశాలను పాటించనందుకు విధించింది. రుణాలు, అడ్వాన్సులు, ఇతర పరిమితుల నియమాలు పాటించడంలో బ్యాంక్ విఫలమైనందున పెనాల్టీ వేసింది. అంతేకాకుండా ఏటీఎమ్‌లకు అవసరమైన నియంత్రణ చర్యలు అమలు చేయడం బ్యాంక్‌ విఫలమైంది. యాక్సిస్ బ్యాంకుపై రూ.30 లక్షల జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ మరో ప్రకటనలో తెలిపింది. గడువు తేదీలోగా ఖాతాదారులు ఇతర మార్గాల ద్వారా బకాయిలు చెల్లించినా.. క్రెడిట్ కార్డ్ బకాయిలను ఆలస్యంగా చెల్లించారంటూ కొన్ని అకౌంట్లకు జరిమానా ఛార్జీలు విధించినట్లు తేలింది. రెగ్యులేటరీ సమ్మతిలో లోపాల ఆధారంగా పెనాల్టీ విధిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.

Also Read: Ertiga vs Kia Carens: మారుతి ఎర్టిగా నచ్చడం లేదా, అద్భుత ఫీచర్లతో కియా క్యారెన్స్

గతేడాది కూడా యాక్సిస్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. కేవైసీ మార్గదర్శకాలతో సహా వివిధ ఉల్లంఘనలకు పెనాల్టీ విధించింది. ఆర్‌బీఐ జారీ చేసిన కొన్ని సూచనలను పాటించనందుకు యాక్సిస్ బ్యాంక్‌పై రూ.93 లక్షల పెనాల్టీని చెల్లించింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. ప్రైవేట్ రంగ రుణదాత రుణాలు, అడ్వాన్సులు, కేవైసీ మార్గదర్శకాలు, 'పొదుపు బ్యాంకు ఖాతాలలో కనీస నిల్వ నిర్వహణ'కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు బ్యాంకులకు ఈ జరిమానా విధిస్తుంది.

Also Read: Aadhaar Card Photo Change: 8 ఏళ్ల బాలుడి ఆధార్‌ కార్డులో డిప్యూటీ సీఎం ఫొటో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News