Power Star: వైరల్ అవుతోన్న ఆర్జీవీ పవర్‌స్టార్ ఫస్ట్‌లుక్ పోస్టర్

ఒకదాని తరువాత మరో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్న రామ్‌గోపాల్ వర్మ ( Ramgopal varma ) అనుకున్నది మాత్రం పూర్తి చేస్తుంటారు. పీకే ఆధారిత సినిమాగా పవర్‌స్టార్ ( Power star ) పేరుతో తీయదల్చుకున్న సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ( First look poster )  ను ట్విట్టర్ లో విడుదల చేశారు ఆర్జీవీ. షేర్ చేసిన గంటలోనే తెగ వైరల్ అవుతోంది ఈ పోస్టర్. 

Last Updated : Jul 9, 2020, 01:43 PM IST
Power Star: వైరల్ అవుతోన్న ఆర్జీవీ పవర్‌స్టార్ ఫస్ట్‌లుక్ పోస్టర్

ఒకదాని తరువాత మరో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్న రామ్‌గోపాల్ వర్మ ( Ramgopal varma ) అనుకున్నది మాత్రం పూర్తి చేస్తుంటారు. పీకే ఆధారిత సినిమాగా పవర్‌స్టార్ ( Power star ) పేరుతో తీయదల్చుకున్న సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ( First look poster )  ను ట్విట్టర్ లో విడుదల చేశారు ఆర్జీవీ. షేర్ చేసిన గంటలోనే తెగ వైరల్ అవుతోంది ఈ పోస్టర్. 

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మొత్తానికి ఫస్ట్‌లుక్ పోస్టర్ ( First look poster ) ను విడుదల చేశారు. అఫీషియల్  ట్విట్టర్ అక్కౌంట్ (Twitter Account ) లో పోస్టర్ విడుదల చేసినప్పటి నుంచి బాగా వైరల్ అవుతోంది. పవర్‌స్టార్ పేరుతో  నిర్మిస్తున్న ఈ సినిమా పై పవన్ కళ్యాణ్ ( Pawan kalyan )  అభిమానులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు దిగారు. దీనికి సమాధానంగా వర్మ చేసిన ట్వీట్ కూడా చెప్పకనే చెబుతోంది ఎవర్ని ఉద్దేశించనేది. ఈ సినిమా ఎవర్నీ ఉద్దేశించి కాదని...యాధృఛ్ఛికంగా ఎవరితోనైనా పోలి ఉంటే ఉండవచ్చని అన్నారు. Also read: Apsara Rani & RGV: ఆమె ఒరిస్సా కాదు..ఒడిషా బ్యూటీ

ఇక ఫస్ట్‌లుక్ పోస్టర్ లో సైతం ఎన్నికల ఫలితాల తరువాత అంటూ ఉదహరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిజంగానే ఎవరినీ ఉద్దేశించి తీసింది కానప్పుడు...పవర్‌స్టార్ సినిమాలో ఎన్నికల ఫలితాల తరువాత అనే క్యాప్షన్ అవసరం ఏమొచ్చిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

power star second look

మొత్తానికి పవర్‌స్టార్ ( Power star ) ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆర్జీవీ ( RGV ) మరోసారి ట్రెండ్ అవుతున్నారు. Also read: Prabhas 20: ప్రభాస్ 20వ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల తేదీ తెలిసింది

Trending News