మెగా స్థార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో రూపొంచిన మూవీ ''సైరా'' నరిసింహారెడ్డిని చూసేందుకు అభిమానులతో పాటు ప్రేక్షకులు పోటెత్తుతున్నారు. తెరపైకి ఎక్కగానే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సైరా అదే స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక అనుమతి తీసుకొని మరీ అదనపు షోలు వేశారు. దీంతో ఫస్ట్ డే సైరా సినిమాకు భారీ స్థాయిలో వసూళ్లు వచ్చాయి.
మొదటి రోజు ఈ సినిమాకు దాదాపు 39 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇది అఫీషియల్ ఎమౌంట్ కాదు. మేకర్స్ ఇప్పటివరకు అధికారికంగా లెక్కలు విడుదల చేయలేదు. గ్రాస్ తో కలిపి ఓ ఎమౌంట్ ను పోస్టర్ రూపంలో విడుదల చేసే ఛాన్స్ ఉంది.
ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్స్ (అంచనా)
నైజాం – రూ. 8.13 కోట్లు
సీడెడ్ – రూ. 6.13 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.72 కోట్లు
ఈస్ట్ – రూ. 5.34 కోట్లు
వెస్ట్ – రూ. 4.10 కోట్లు
గుంటూరు – రూ. 5.05 కోట్లు
నెల్లూరు – రూ. 2.18 కోట్లు
కృష్ణా – రూ. 3.03 కోట్లు