ఆమెకు నాలుగోసారి కరోనా పాజిటీవ్.. కుటుంబంలో ఆందోళన

ఆమెకు మరోసారి కోవిడ్19 పాజిటీవ్‌గా తేలింది. దీంతో ఆమెకు కరోనా పాజిటీవ్ రావడం నాలుగోసారి అయింది. కుటుంబసభ్యులు సింగర్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated: Mar 30, 2020, 10:52 AM IST
ఆమెకు నాలుగోసారి కరోనా పాజిటీవ్.. కుటుంబంలో ఆందోళన

లక్నో: కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన బాలీవుడ్ సింగర్‌ కనికా కపూర్‌కు మరోసారి కోవిడ్19 పాజిటీవ్‌గా తేలింది. దీంతో ఆమెకు కరోనా పాజిటీవ్ రావడం నాలుగోసారి అయింది. కనికకు తాజా టెస్టుల్లోనూ కోవిడ్ నెగటీవ్ రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిస్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రభుత్వం ఆదేశాలు పాటించకుండా, క్వారంటైన్‌లో ఉండని కారణంగా ఆమెపై కేసు కూడా నమోదైంది. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్

మార్చి 9న లండన్ నుంచి తిరిగొచ్చిన కనికా కపూర్ లక్నో, కాన్పూర్ ప్రాంతాలకు వెళ్లింది. దగ్గు, జ్వరంతో మార్చి 20న ఆసుపత్రిలో చేరింది. కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటీవ్‌గా తేలింది. కోవిడ్19 పాజిటీవ్‌గా తేలినా పార్టీలకు హాజరవ్వడంతో ఆమెపై తీవ్ర విమర్శలొచ్చాయి. అనంతరం హాస్పిటల్‌లో అడ్మిన్ అయినప్పటికీ నేనేమైనా వ్యాధిగ్రస్తురాలినా అంటూ సెలబ్రిటీ హోదాను చూపించేయత్నం చేసి మరోసారి విమర్శలకు కేంద్ర బిందువైంది.  బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!

తాజా పరీక్షల్లోనూ కోవిడ్19 పాజిటీవ్‌గా తేలడంతో కనికా కపూర్ శరీరం ట్రీట్‌మెంట్‌‌కు సహకరించడం లేదని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్, విమాన సర్వీసులపై తాత్కాలిక రద్దు కొనసాగుతోందని, లేకపోతే విదేశాలకు తీసుకెళ్లి ఆమెకు వైద్యం చేపించేవాళ్లమని అంటున్నారు. ఆమె కోలుకోవాలని ప్రార్థించడం తప్ప మేం ఏం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనిక ఆరోగ్య పరిస్థితి మామూలుగానే ఉంది వైద్యులు చెబుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photos 

బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone