'రామ్ అసుర్' తర్వాత అభినవ్ సర్దార్ నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టేక్'. ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించారు. ASP బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాను ఆగస్ట్ 4న రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు, కమెడియన్ ప్రియదర్శి విడుదల చేశారు. ఈ సందర్భంగా..
ప్రియదర్శి మాట్లాడుతూ.. "అభినవ్ సర్దార్‌గారు హీరోగా నటిస్తూనే నిర్మాతగా మిస్టేక్ సినిమా చేశారు. మంచి కథపై నమ్మకంతో ఆయన నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 4న రిలీజ్ అవుతుంది. సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
అభినవ్ సర్దార్ మాట్లాడుతూ... "మంచి పాయింట్ అనిపించగానే 'మిస్టేక్' సినిమాను మొదలు పెట్టాం. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రజమైజ్ కాలేదు. డైరెక్టర్ భరత్ కథ చెప్పగానే ఈ సినిమాకు ఓకే చెప్పాను. సినిమా ఔట్‌పుట్ బాగా వచ్చింది. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి. కామెడీ, సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే అంశాలన్నీ ఉంటాయి. మణి జెన్నా సంగీతం, హరి జాస్తి సినిమాటోగ్రఫీ పెద్ద ఎసెట్ అవుతాయి. మంగ్లీ, రోల్ రైడా, రేవతి పాడిన సాంగ్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 4న వస్తోన్న మూవీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది" అన్నారు.
Also Read: ITR Filing Deadline: ఐటీఆర్ ఫైలింగ్‌కు నేడే లాస్ట్ డేట్.. ఈ ఐదు తప్పులు చేయకండి
డైరెక్టర్ సన్నీ అలియాస్ భరత్ కొమ్మాలపాటి మాట్లాడుతూ... "సినిమాలో కావాల్సినంత కామెడీ ఉంది. ఇక యాక్షన్ సన్నివేశాలను తెలుగు సినిమాల్లో రానటువంటి యూనిక్ స్టైల్లో డిజైన్ చేసి చిత్రీకరించాం. ఆ యాక్షన్ పార్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యూత్, ఫ్యామిలీ సహా అన్నీ వర్గాల ప్రేక్షకులను సినిమా మెప్పిస్తుంది. ఆగస్ట్ 4న మీ ముందుకు వస్తున్న ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
నటీనటులు:
అభినవ్ సర్దార్, అజయ్ కతుర్‌వర్, సుజిత్, తేజ ఐనంపూడి, కరిష్మా కుమార్, తానియా కల్రా, ప్రియా పాల్ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: ఎ.ఎస్.పి.మీడియా హౌస్,
నిర్మాత: అభినవ్ సర్దార్,
స్టోరి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భరత్ కొమ్మాలపాటి,
మ్యూజిక్: మణి జెన్నా,
సినిమాటోగ్రాఫర్: హరి జాస్తి,
ఎడిటర్: విజయ్ ముక్తావరపు,
డైలాగ్స్: శిరీషా మంద,
ఆర్ట్: రవి కుమార్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నిధి
Also Read: RPF Jawan Fire: ముంబై-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్‌పీఎఫ్ జవాన్ కాల్పులు.. నలుగురు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి