హీరోయిన్ నగ్నచిత్రాలు ఇంటర్నెట్‌లో పెట్టాడు.. జైలుకెళ్లాడు..!

హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్‌కి చెందిన న్యూడ్ చిత్రాలను తస్కరించి వాటిని ఇంటర్నెట్‌లో ప్రచారం చేసిన ప్రముఖ హ్యాకర్ జార్జ్ గర్ఫానోని ఎట్టకేలకు అమెరికన్ పోలీసులు అరెస్టు చేశారు. 

Last Updated : Aug 31, 2018, 11:56 AM IST
హీరోయిన్ నగ్నచిత్రాలు ఇంటర్నెట్‌లో పెట్టాడు.. జైలుకెళ్లాడు..!

హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్‌కి చెందిన న్యూడ్ చిత్రాలను తస్కరించి వాటిని ఇంటర్నెట్‌లో ప్రచారం చేసిన ప్రముఖ హ్యాకర్ జార్జ్ గర్ఫానోని ఎట్టకేలకు అమెరికన్ పోలీసులు అరెస్టు చేశారు. గతకొంతకాలంగా హాలీవుడ్ సెలబ్రిటీల న్యూడ్ చిత్రాలను సేకరించడమే పనిగా పెట్టుకున్న జార్జి వారి ఐక్లౌడ్ ఖాతాలను హ్యాక్ చేస్తూ.. వారి ఆంతరంగిక చిత్రాలను తస్కరించి వారిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.

తన బ్లాక్ మెయిల్స్‌కు లొంగని సెలబ్రిటీల చిత్రాలను మాత్రం ఇంటర్నెట్‌లో లీక్ చేయడం ప్రారంభించాడు. 2014లో అమెరికాలో బట్టబయలైన అతిపెద్ద హ్యాకింగ్ స్కాండల్‌లో జార్జి కూడా ప్రముఖ పాత్ర పోషించాడు. తొలుత సెలబ్రిటీల ఫోటోలు మాత్రమే చోరీ చేయడం పనిగా పెట్టుకున్న జార్జి ఆ తర్వాత 240 మంది సామాన్య అమ్మాయిల చిత్రాలను కూడా తస్కరించాడు. అందులో కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగినులు కూడా ఉన్నారు. ఇటీవలే కోర్టులో జార్జిని ప్రవేశపెట్టినప్పుడు.. చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.

ఆపిల్ సంస్థ సెక్యూరిటీ స్టాఫ్ నుండి మెయిల్స్ పంపిస్తున్నట్లు తొలుత ఈమెయిల్స్, ఫోన్ మెసేజ్స్ పంపించడం అలవాటు చేసుకున్న జార్జి.. ఆ సందేశాలకు వచ్చే రిప్లైలను ఆధారంగా చేసుకొని.. వారి ఖాతాలను హ్యాక్ చేసేవాడు. ఆ తర్వాత సెలబ్రిటీల పర్సనల్ ఈమెయిల్స్, పాస్‌వర్డ్స్ కూడా తస్కరించేవాడు. హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ తన న్యూడ్ చిత్రాలు లీక్ అవ్వగానే... పోలీసులను ఆశ్రయించి కేసును నమోదు చేశాక మాత్రమే.. ఈ స్కాండల్ వెనుక ఉన్న వ్యక్తుల గురించి పోలీసులు సీరియస్‌గా వెతకడం ప్రారంభించారు.

తర్వాత సైబర్ నిపుణులు నిఘా వ్యవస్థను పటిష్టం చేసి ఎట్టకేలకు జార్జిని పట్టుకున్నారు. జార్జి చేసిన నేరాలు అంగీకరించడంతో కోర్టు అతనికి ఎనిమిది నెలలు కారాగార శిక్ష విధించడంతో పాటు 60 గంటలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపింది. అలాగే మూడు సంవత్సరాలు అతనిపై సూపరివైజ్డ్ రిలీజ్ పద్ధతిని అనుసరించాలని తెలిపింది. సూపరివైజ్డ్ రిలీజ్ పద్ధతిలో విడుదల అయినా కూడా నిందితులపై పోలీస్ నిఘా పూర్థిస్థాయిలో ఉంటుంది. ఈ క్రమంలో వారు మళ్లీ నేరాలకు పాల్పడితే వారిని తిరిగి అరెస్టు చేయవచ్చు. 

Trending News