టిక్‌టాక్ ను ఇండియాలో బ్యాన్ చేయబోతున్నారా?

టిక్‌టాక్ చిన్న వీడియో-షేరింగ్ అప్లికేషన్. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ఖ్యాతిని, అపఖ్యాతిని కూడా పొందింది. భారతదేశంలో టిక్ టాక్ ఇప్పుడు ఎదురుదెబ్బలను ఎదుర్కొంటోంది. ఇది గూగుల్ ప్లే స్టోర్లో దాని రేటింగ్ 1 స్టార్ 

Updated: May 22, 2020, 07:36 PM IST
టిక్‌టాక్ ను ఇండియాలో బ్యాన్ చేయబోతున్నారా?

న్యూడిల్లీ: టిక్‌టాక్ చిన్న వీడియో-షేరింగ్ అప్లికేషన్. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ఖ్యాతిని, అపఖ్యాతిని కూడా పొందింది. భారతదేశంలో టిక్ టాక్ ఇప్పుడు ఎదురుదెబ్బలను ఎదుర్కొంటోంది. ఇది గూగుల్ ప్లే స్టోర్లో దాని రేటింగ్ 1 స్టార్ కి పడిపోవడానికి దగ్గర్లో ఉందని, సమీప భవిష్యత్తులో దేశంలో నిషేధానికి దారితీసే అవకాశమున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read Also: కుప్పకూలిన పాక్ విమానం..

భారతదేశంలోని వినియోగదారులు గత కొన్ని రోజులుగా గూగుల్ ప్లే స్టోర్‌లో 1-స్టార్ రేటింగ్ ఇస్తున్నారు. దీని కారణంగా యాప్ ప్రస్తుత రేటింగ్, యాప్ స్టోర్‌లో 4.5 నుండి 1.3 కి పడిపోయింది. మొత్తం 1-స్టార్ రేటింగ్ తరువాత #bantiktok హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. భారతదేశంలో మరోసారి ఈ యాప్‌ను నిషేధించాలని ప్రజలు డిమాండ్ చేశారు. 

Also Read: Temperature updates : ఎండలతో హీటెక్కిన ఢిల్లీ.. తెలంగాణ, ఏపీలోనూ మండుటెండలు

ఇదిలాఉండగా యూట్యూబ్ వర్సెస్ టిక్‌టాక్ యుద్ధం నేపథ్యంలో జనాదరణ పొందిన యూట్యూబర్ క్యారీమినాటి యూట్యూబ్‌లో ప్రముఖ టిక్‌టాకర్ అమర్ సిద్దిఖీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇది ప్రారంభమైంది. ఈ వీడియో వీక్షకుల నుండి మిలియన్ల వీక్షణలు, మద్దతులను సేకరించింది. అయితే నిబంధనలను పాటించనందున వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫాం నుండి తొలగించబడింది. టిక్‌టాక్ గూగుల్ ప్లే స్టోర్‌లో పేలవమైన రేటింగ్‌ను పొందడం పొందడంతో క్యారీమినాటికి మద్దతుగా ట్విట్టర్లో ఉర్రూతలూగింది. మరొక టిక్‌టాకర్ ఫైసల్ సిద్దిఖీ యాసిడ్ దాడులకు సంబంధించి ఓ టిక్‌టాక్ సందేశాన్ని పోస్ట్ చేయడంతో పరిస్థితి మరింత పీక్ స్థాయికి పెరిగింది. కాగా ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో మరింత పేలవమైన రేటింగ్‌కు దారితీసిందని అభిప్రాయాడుతున్నారు. మరోవైపు భారతదేశంలో టిక్ టాక్ ను నిషేధించాలని కోరుతున్నారు. #IndiansagainstTikTok అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో నడుస్తోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..