రామ్‌చరణ్‌-బోయపాటి సినిమా టైటిల్ ఇదే..!

రామ్‌చరణ్‌ కొత్త సినిమా టైటిల్ ఇదే..!

Updated: Oct 7, 2018, 03:20 PM IST
రామ్‌చరణ్‌-బోయపాటి సినిమా టైటిల్ ఇదే..!

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే..! రంగస్థలం హిట్ తర్వాత చరణ్ బోయపాటి శ్రీను సినిమాకు సైన్ చేశాడు. దాంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి.  ఈ సినిమా ప్రస్తుతం యూరప్‌లోని అజర్‌బైజాన్‌లో షూటింగ్ జరుపుకొంటోంది.అయితే ఈ సినిమాకు ఇంతవరకు టైటిల్ ఖరారు కాలేదు. అభిమానులు కూడా టైటిల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

గత కొన్ని రోజులుగా రామ్ చరణ్-బోయపాటి సినిమా టైటిల్ పై వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి.  ఇప్పుడు మరో ఆసక్తికర టైటిల్‌ ప్రచారంలోకి వచ్చింది.ఈ సినిమాకు ‘వినయ విధేయ రామా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిలిం వర్గాల సమాచారం. చెర్రీ సినిమాకు ఈ క్లాస్‌ టైటి పెడితే ఎలా ఉంటుంది? అని ఆలోచిస్తున్నారట మూవీ యూనిట్.

అయితే గతంలోనూ ఈ సినిమా టైటిల్ పై అనేక వార్తలు వచ్చాయి. 'రాజవంశస్థుడు' అని మొదట్లో వార్తలు వచ్చాయి. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘స్టేట్‌ రౌడీ’ టైటిల్‌ను పెట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  హిట్ చిత్రం 'తమ్ముడు' కూడా పరిశీలనలో ఉందని.. ఇక చివరగా 'రౌడీ తమ్ముడు' అనే టైటిల్ పై జోరుగా కథనాలు వెలువడ్డాయి. దీంతో రామ్ చరణ్ సినిమాకి టైటిల్ కన్ఫర్మ్ అయిందని అభిమానుల హడావిడి మొదలైంది. అయితే నిజమేంటంటే.. ఇప్పటికి వరకు రామ్ చరణ్-బోయపాటి సినిమా టైటిల్ అధికారికంగా ఖరారు కాలేదు.

ఇక ఈ చిత్రంలో నటీనటుల విషయానికి వస్తే.. చరణ్‌కు జోడీగా కైరా అద్వానీ, బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్ గా, కీలక పాత్రలోఆర్యన్‌ రాజేశ్‌ కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.