యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసే 12 అంకెల ఆధార్‌కార్డు దేశంలో ఓ ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. దేశంలో అన్నింటికి అవసరమైన గుర్తింపుకార్డు కూడా. మీ డెమోగ్రఫిక్, బయోమెట్రిక్ డేటా మొత్తం అందులోనే ఉంటుంది.
యూఐడీఏఐ ఇప్పుడు ఆధార్‌కార్డును అప్‌డేట్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది. చాలావరకూ వివరాలు ఇందులో దశలవారీగా లేదా ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్‌డేట్ చేసుకోవచ్చు. డెమోగ్రఫిక్ సమాచారమైన పేరు, చిరునామా, పుట్టిన తోదీ, వయస్సు, జెండర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, రిలేషన్‌షిప్ వంటివి అప్‌డేట్ చేసుకునే వీలుంది.
ఇక రెండవది మీ ఐరిస్, ఫింగర్ ప్రింట్స్, ఫేసియల్ ఫోటోగ్రాఫ్ కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు. మీ ఫేసియల్ ఫోటోగ్రాఫ్ మార్చుకోవాలనుకుంటే..బయోమెట్రిక్ సమాచార మార్పిడి కిందకు వస్తుంది. ఆన్‌లైన్ ప్రక్రియలో ఇది సాధ్యం కాదు. మీరు వ్యక్తిగతంగా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి అప్‌డేట్ చేసుకోవాలి.
ఆధార్ కార్డులో మీ ఫోటోను మార్చుకునే ప్రక్రియ ఇలా
ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/.సందర్శించాలి. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫాం డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇందులో అడిగిన అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి. సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రానికి వెళ్లేందుకు అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. ఆ తరువాత ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రంలో మీ కొత్త ఫోటో తీసుకుంటారు. దీనికోసం ఆ కేంద్రంలో 100 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
మీ ఆధార్‌కార్డు స్టేటస్ కోసం యూఆర్ఎన్ నెంబర్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు అప్‌డేట్ కోసం ఆధార్ సేవాకేంద్రంలో అపాయింట్‌మెంట్ ఆలస్యంగా లభించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook