close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

ఫైటర్‌గా తెరపైకి కనిపించనున్న విజయ్ దేవరకొండ !!

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నెక్ట్స్ మూవీ టైటిల్ పిక్స్ అయింది

Updated: Aug 23, 2019, 12:26 AM IST
ఫైటర్‌గా తెరపైకి కనిపించనున్న విజయ్ దేవరకొండ !!

డియర్ కామ్రేడ్ తో మాస్ ఇమేజ్ సంపాదించుకున్న క్లాస్ హీరో విజయ్ దేవరకొండ.. ఆ ఇమేజ్ ను మరింత పటిష్టం చేసుకునేందకు మరో మాస్ మూవీకి రెడీ అవుతున్నాడు. అది కూడ పక్కా మాస్ డైరక్టర్ డైరక్టర్ గా గుర్తింపుపొందిన పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో ... ఇస్మార్ట్ శంకర్ మూవీసి తెరకెక్కించి మంచి ఊపు మీద ఉన్న పూరీ ..ఇదే తరహాలో స్టయిల్ లో  కంప్లీట్ మాస్ మాసాలా ఎలిమెంట్స్ తో తీయబోతున్నట్లు టాక్.

వచ్చే ఏడాది జనవరి నుంచి  రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని భావిస్తున్న చిత్ర యూనిట్..ఈ మూవీకి ఇప్పుడే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తేలిసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాకు '' ఫైటర్'' అనే టైటిల్ ను పెట్టబోతున్నారట. అయితే ఈ విషయంలో అఫీషియల్ స్టేట్ మెంట్ మాత్రం రావడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు పూరి జగన్నాధ్.