Tips For Protecting Your Skin: శీతాకాలంలోని చలిగాలుల నుంచి చర్మాన్ని కాపాడుకోవడం ఎలా?

Tips For Protecting Your Skin: వాతావరణంలో క్రమంగా మార్పులు వస్తున్న క్రమంలో చర్మ సంరక్షణ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చలిగాలుల కారణంగా తేమను కోల్పోకుండా చర్మానికి మాయిశ్చరైజర్లు వాడడం మంచిదని సౌందర్యనిపుణులు సూచిస్తారు. మరి చర్మానికి తగిన తేమ అందాలన్నా.. మృదువుగా ఉండాలన్నా కొన్ని చిట్కాలు తప్పనిసరిగా పాటించాల్సిఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2021, 06:15 PM IST
Tips For Protecting Your Skin: శీతాకాలంలోని చలిగాలుల నుంచి చర్మాన్ని కాపాడుకోవడం ఎలా?

Tips For Protecting Your Skin: వాతావరణం మారుతున్నప్పుడు చర్మ సంరక్షణ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటారు సౌందర్యనిపుణులు. ముఖ్యంగా చలిగాలుల ప్రభావం పడకుండా ఉండాలన్నా, చర్మానికి తగిన తేమ అందాలన్నా లోషన్లు లేదా పెట్రోలియం జెల్లీ కలిగిన మాయిశ్చరైజర్లు వాడేందుకు ప్రయత్నించండి. చలికాలంలో చర్మం పొడిబారే సమస్య అందరికీ ఎదరవుతుంది. మరి చర్మానికి తగిన తేమ అందాలన్నా, మృదువుగా ఉండాలన్నాకొన్నింటిని పాటించాల్సిఉంది.

చలి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు చిట్కాలు..

  • సాధారణ మాయిశ్చరైజర్లు కంటే పెట్రోలియం లేదా క్రీమ్ ఆధారిత మాయిశ్చరైజర్లు చర్మంపై రాయడం ఉత్తమం. స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ రాస్తే.. ఉపరితల తేమను పట్టుకోవడంలో సహాయపడుతుంది.
  • చర్మాన్ని అతిగా శుభ్రం చేయకుండా.. సహజమైన మాయిశ్చరైజర్ల చర్మానికి వాడడం మంచిది. చలి కాలంలో అతిగా సబ్బు వినియోగించడం మానుకుంటే మంచిది.
  • శీతాకాలంలో చర్మం వెంటనే పొడిబారుతుంది. దాన్ని అరికట్టేందుకు వేడి నీటితో స్నానం, పెట్రోలియం జెల్లీ కలిగిన మాయిశ్చరైజర్లు వినియోగించడం మేలు.
  • శీతాకాలంలో చలిగాలులు.. చర్మంపై తేమను లాగుతుంది. రూమ్ హ్యూమిడిఫైయర్లు ద్వారా చర్మాన్ని తేమగా ఉంచడం మంచిది.
  • చలి గాలుల నుంచి ముఖాన్ని కాపాడుకునేందుకు.. పెట్రోలియం ఆధారిత లిప్ బామ్ తో రక్షణ పొందవచ్చు. పెట్రోలియం, సిరమైడ్ లు ఉన్న క్రీమ్ లతో స్కిన్ ను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
  • చలి కారణంగా చర్మం లేదా శరీరంలో ఏమైనా రుగ్మతలు ఏర్పడితే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మేలు.
  • సూర్యుడి నుంచి చర్మాన్ని రక్షించుకోండి. శీతాకాలపు సూర్యరశ్మి చర్మానికి ప్రమాదకరం కావొచ్చు. సన్ స్రీన్ లోషన్ చర్మానికి అప్లే చేయడం మంచిది. సూర్యరశ్మిలో ఎక్కువగా ఉండడం వల్ల చర్మంపై ముడతలు, వెంటనే వృద్ధాప్యం రావొచ్చు.
  • వేసవిలో మాదిరిగానే చర్మాన్ని మెరుపు కోసం మాయిశ్చరైజర్లు పాటు స్కిన్ ట్యానర్ లను వినియోగించడం వల్ల చర్మాన్ని పొడిగా చేస్తాయి.
  • విటమిన్-డి వల్ల చర్మం మరింత కాంతిమంతంగా కనిపిస్తుంది. అది కొన్ని ఆహారపు అలవాట్లతో పాటు సూర్యరశ్మి వల్ల లభిస్తుంది.
  • చర్మం ఎల్లప్పుడూ పొడిగా ఉండకూడదు. శీతాకాలంలో చర్మంపై పొలుసులు, దురదలు, దద్దుర్లు వస్తే చర్మవ్యాధి నిపుణుడ్ని సంప్రదించాలి.

Also Read: Pregnancy Avoid Food: ప్రెగ్నన్సీ సమయంలో ఇవి తింటున్నారా..? అయితే మీకు సమస్యలు తప్పవు

Also Read: Health Benefits of Tilasi: సర్వరోగ నివారిణి మన తులసి.. నమ్మట్లేదా..? అయితే ఇది చదవండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News