Heart Health: మీ గుండెను పదికాలాల పాటు పదిలంగా ఉంచే ఆహారాలు..

గుండె మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మూలమైన ఆహారాలను డైట్ లో చేర్చుకోవడం ఎంతో అవసరం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2023, 04:25 PM IST
Heart Health: మీ గుండెను పదికాలాల పాటు పదిలంగా ఉంచే ఆహారాలు..

Heart Health: గత కొన్నేళ్లుగా చూస్తే.. ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బుల భారిన పడే వారి సంఖ్య అధికమయ్యాయి. ఇక మన భారత దేశం విషయానికి వస్తే.. గుండె వ్యాధులతో గురయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే మన దేశంలో ఎక్కువమంది నూనెలు వాడటం మరియు అనారోగ్యకర జీవన శైలి ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు. మీరు మీ గుండెను పదిలంగా ఉంచాలి అనుకుంటే.. రోజు తినే ఆహారంలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ ఉండేలా చూసుకోవాలి. గ్రేటర్ నోయిడాలోని GIMS హాస్పిటల్‌లో పనిచేస్తున్న ప్రముఖ డైటీషియన్ డాక్టర్ ఆయుషి యాదవ్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా లభించే ఆహార పదార్ధాల గురించి తెలిపారు. 

సహజమైన ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్ ఆహారాలు.. 

వాల్ నట్స్  
వాల్ నట్స్  వల్ల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాల గురించి అందరికి తెలుసు. వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్ తో పాటు కాపర్, విటమిన్ 'E' మరియు మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. కానీ వాల్ నట్స్ ప్రభావం వలన శరీరంలో వేడి పెరుగుతుంది. ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని.. వేసవిలో వాల్ నట్స్ ని ఎక్కువగా తినకూడదు.  

సోయాబీన్  
శాఖాహారులకు ప్రోటీన్ ఎక్కువగా అందించే ఆహారం సోయాబీన్ . అంతేకాకుండా.. ఒమేగా -3 మరియు ఒమేగా -6 ఫాటీ ఆసిడ్ లు సోయాబీన్స్ లో పుష్కలంగా ఉంటాయి. వీటిని మన తినే డైట్ లో క్రమంగా తప్పకుండా తినటం వలన శరీరానికి ఫోలేట్, మెగ్నీషియం,పొటాషియం మరియు ఫైబర్ వంటి పోషకాలు కూడా అందిస్తాయి. 

అవిసె గింజలు  
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి.. గుండెను పదికాలాల పాటు పచ్చగా ఉంచే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ అవిసె గింజలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో మెగ్నీషియం, విటమిన్ C వంటి పోషకాలను కలిగి ఉంటాయి.  

Also Read: MLC Kavitha: ఈడీ నోటీసులను లైట్‌ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత.. విచారణకు డుమ్మా..?   

చేపలు  
మాంసాహారులకు ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్ లను కలిగి ఉండే గొప్ప గొప్ప మూలం చేపలు అనే చెప్పాలి. ఎక్కువగా సాల్మన్ ఫిష్ తింటే మంచిది. అంతేకాకుండా చేపల ద్వారా శరీరానికి  మెగ్నీషియం, పొటాషియం, ప్రొటీన్లు, విటమిన్ B5 లభించడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.  

గుడ్లు.. 
గుడ్డుని ముఖ్యంగా ప్రోటీన్ యొక్క మూలంగా పరిగణిస్తారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే.. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్ కూడా పుష్కలంగా ఉంటుంది. కావున రోజు అల్పాహార సమయంలో రెండు ఉడకబెట్టిన గుడ్లని ఖచ్చితంగా తింటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

Also Read: Birth Certificate: ఇక నుంచి బర్త్ సర్టిఫికెట్ చాలు గురూ.. అన్నింటికి సింగిల్ డాక్యుమెంట్‌గా..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News