Aloe For Weight Loss: స్థూలకాయులకు గుడ్ న్యూస్- ఈ చిట్కాతో వెంటనే బరువు తగొచ్చు!

Aloe For Weight Loss: అధిక బరువుతో బాధపడే వారు బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వారి కోసం ఓ సూపర్ చిట్కా ఉంది. ఇంట్లోని పెరట్లో ఉండే కలబందతో తక్షణం బరువు తగ్గే ఉపాయం ఉంది. అదెలాగో తెలుసుకోండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2022, 09:53 AM IST
    • అధిక బరువుతో బాధపడే వారికి గుడ్ న్యూస్!
    • బరువు తగ్గించుకునేందుకు సూపర్ చిట్కా
    • కలబంద జ్యూస్ తో తక్కువ సమయంలోనే బరువు తగొచ్చు
Aloe For Weight Loss: స్థూలకాయులకు గుడ్ న్యూస్- ఈ చిట్కాతో వెంటనే బరువు తగొచ్చు!

Aloe For Weight Loss: ప్రస్తుతం ప్రతి ఇంట్లోని పెరట్లో కలబందకు సంబంధించిన చిన్న మొక్క అయిన ఉంటుంది. ఎందుకంటే దాని ఉపయోగాలే దాన్ని పెరట్లో పెంచుకునే విధంగా ప్రేరేపిస్తుంది. కలబంద వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కలబందలోని డిటాక్సిఫైయింగ్ గుణాలు శరీర బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 

దీంతో పాటు కలబంద వినియోగం వల్ల చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో తక్షణం పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బరువు తగ్గడానికి, కలబందను అనేక రకాలుగా తీసుకోవచ్చు.

కలబందలో విటమిన్ ఎ, సి, ఇ, ఫోలిక్ యాసిడ్, కోలిన్, బి1, బి2, బి3, బి6 వంటివి ఉన్నాయి. దీనితో పాటు విటమిన్ బి12, కాల్షియం, మెగ్నీషియం, జింక్, క్రోమియం, సెలీనియం, సోడియం, ఐరన్, పొటాషియం, కాపర్ మరియు మాంగనీస్ వంటి 20 రకాల ఖనిజాలు ఉన్నాయి. ఇది మొత్తం శరీరం యొక్క ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా మారడం సహా బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. 

బరువు తగ్గడానికి కలబంద వినియోగం..

1. వెచ్చని నీటిలో దీన్ని కలుపుకొని తాగాలి

బరువు తగ్గడానికి, మీరు ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో కలబంద గుజ్జును కలపవచ్చు. 

2. తేనెతో కలిపి తీసుకోవాలి

కలబంద రసంలో తేనె కలుపుకొని తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. తద్వారా దాని రుచి మరింత మెరుగుపడుతుంది.

3. నిమ్మకాయతో కలిపి..

ఒక గ్లాసు నీరు తీసుకుని అందులో ఒక నిమ్మకాయ రసాన్ని కలపండి. దానితో ఒక టీస్పూన్ కలబంద గుజ్జును కలపండి. ఈ ద్రావణాన్ని ఒక గిన్నెలో వేడి చేసి తిప్పుతూ ఉండాలి. ఒక టీస్పూన్ తేనెతో తీసుకోవాలి. 

(నోట్: వైద్య సలహా మేరకు ఈ సమాచారాన్ని పొందుపరచడం జరిగింది. దీన్ని ZEE తెలుగు NEWS ధ్రువీకరించడం లేదు.)  

Also Read: Vegetable Juices: కూరగాయల జ్యూస్‌లు.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Also Read: immunity supplements: ఇమ్యునిటీ కోసం ఇవి ఎక్కువగా తీసుకుంటే.. మరో పెద్ద రిస్క్ తప్పదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News