How To Reduce Cholesterol In 7 Days: ప్రస్తుతం చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. శరీరంలో విచ్చలవిడిగా కొవ్వు పేరుకుపోవడం వల్ల చాలా రకాల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే కొందరిలో ప్రాణాంతకంగానూ మరే ఛాన్స్ ఉంది. కాబట్టి కొవ్వు నియంత్రణలో ఉండడానికి తప్పకుండా ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోజువారీ జీవనశైలిలో మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి నివారణల కారణంగా సులభంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కింది లక్షణాలతో బాధపడుతున్నవారు ఆరోగ్య నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది.
ఈ సంకేతాల ఉంటే చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్లే:
1. అధిక రక్తపోటు:
ధమనులలో రక్త ప్రవాహం ఆగిపోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. దీని కారణంగా అధిక రక్తపోటు, గుండె పోటు సమస్యలు వస్తాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలతో నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడం కారణంగా శరీరంలో అన్ని అవయవాలు చెడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి రక్త పోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్
2. గుండె జబ్బులు:
అధిక కొలెస్ట్రాల్ కారణంగా కరోనరీ ధమనులలో ఫలకం ఏర్పడటం ప్రారంభమవుతుంది. కాబట్టి గుండె కండరాలకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. దీని కారణంగా రక్త పోటు సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొవ్వు అతిగా పెరగడం కారణంగా వల్ల ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, గుండెపోటు, గుండె వైఫల్యం, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు తీవ్రంగా పెరిగితే తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
3.కిడ్నీ దెబ్బతినడం:
ఆల్కాహాల్ తాగకపోయిన కిడ్నీలు దెబ్బతింటాయి. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి కిడ్నీలలో రక్త ప్రసరణ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారంలో పోషకాలు అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook