High Protein Food: తెల్లగా మెత్తగా పాలుకోవాలాగా ఉండే పన్నీర్ ఫ్రై దగ్గర నుంచి కర్రీ వరకు.. మాగీ దగ్గర నుంచి మోమోస్ వరకు.. దేనికన్నా ఉపయోగించవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉండడంతో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. విరగిన పాలతో పన్నీర్, చీజ్ తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం రోడ్డు మీద చిన్న బంకు దగ్గర నుంచి ఫైవ్ స్టార్ రెస్టారెంట్ వరకు పన్నీర్ లేకుండా మెనూ ఉండదు. అయితే చాలామందికి పన్నీర్ తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న సందేహం ఉంది. అటువంటి సందేహాలు ఉన్న వారి కోసం పన్నీర్ యొక్క విశిష్టత..
పన్నీర్ పాలతో చేసిన ఉత్పత్తి కాబట్టి ఇందులో ప్రోటీన్ అధికమవుతాదులో ఉంటుంది. 100 గ్రాముల పన్నీర్ లో 18 గ్రాముల వరకు ప్రోటీన్ లభిస్తుంది. అంటే 100 గ్రాముల పన్నీర్ 100 గ్రాములు చికెన్ నుంచి ఒకే మోతాదు ప్రోటీన్ మనకు లభిస్తుందని అర్థం. ప్రోటీన్ మన శరీరానికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక పన్నీర్ లో పుష్కలంగా దొరికే కాల్షియం మన ఎముకలను బలంగా ,దృఢంగా తయారు చేస్తుంది. కాల్షియం శాతం తక్కువ ఉన్నవారు, ఎముకలు బలహీనంగా ఉన్నవారు కచ్చితంగా రోజు పన్నీర్ తీసుకోవచ్చు.
బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా పన్నీర్ మంచి డైట్. ఇందులో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండడమే కాకుండా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. బాగా కడుపు నిండినట్లు అనిపిస్తుంది కాబట్టి ఎక్కువగా తినరు. అలాగే పన్నీర్ లోని ప్రోటీన్ మన జీవక్రియను మెరుగుపరచడంతో పాటు పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడుతుంది. అయితే పన్నీరు ఎప్పుడు కూడా లిమిటెడ్ గా తీసుకోవాలి మరీ ఎక్కువగా తీసుకుంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.
పన్నీర్ లో అధిక మోతాదురో లభించే జింక్ తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇన్ఫెక్షన్స్ తో పోరాడడంలో సహాయ పడడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పైగా ఇందులో అధిక మోతాదులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. మితంగా పన్నీరు తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలో చూడండి. మీరు కూడా తప్పకుండా పన్నీర్ ను మీ రోజువారి డైట్ లో భాగంగా చేసుకోండి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించబడింది. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Also Read: Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా
Also Read: Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి