Best Drinks For Diabetics: మధుమేహం ఉన్నవారు ఈ కూల్‌ డ్రింక్స్‌ తాగొచ్చు! ఆ పానీయాలేంటో తెలుసా?

Best Drinks For Diabetics: ప్రస్తుతం మధుమేహం సమస్యలతో బాధపడుతున్నవారు వేసవిలో దాహం తీర్చుకోవడానికి కూల్‌ డ్రింక్స్‌ తాగుతున్నారు. వీటిని తాగడం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి ఈ డ్రింక్స్‌కి బదులుగా ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ పానీయాలు ప్రతి రోజు తీసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 19, 2023, 05:15 PM IST
Best Drinks For Diabetics: మధుమేహం ఉన్నవారు ఈ కూల్‌ డ్రింక్స్‌ తాగొచ్చు! ఆ పానీయాలేంటో తెలుసా?

Best Drinks For Diabetics: ప్రస్తుతం భారత్‌లో వేసవి కాలం కొనసాగుతోంది. వాతావరణంలో ఉష్ణగ్రతలు పెరగడం కారణంగా శరీరంలో నీటి కోరత ఏర్పడుతుంది. దీంతో దాహాం సమస్యలు వస్తాయి. దాహాన్ని తీర్చుకోవడానికి చాలా మంది కూల్‌ డ్రింక్స్‌, సోడా వంటి పానీయాలు ఎక్కువగా తీసుకుంటారు. ఈ చల్లని పదార్థాలు తాగడం తక్షణం ఉపశమనం లభించిన భవిష్యత్‌లో పలు రకాల అనారోగ్య సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  ముఖ్యంగా మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఇలాంటి డ్రింక్స్‌ తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా సులభంగా పెరుగుతాయి. అయితే డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ డ్రింక్స్‌ తాగడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. 

మధుమేహం ఉన్నవారు ఈ తీపి డ్రింక్స్‌ తీసుకోవచ్చు:

జీడిపప్పు పాలు:
జీడిపప్పు పాలు తాగడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జీడిపప్పులోని అనాకార్డిక్ యాసిడ్ సమ్మేళనం రక్తంలో చక్కెర పరిమాణాలను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి మధుమేహం సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు జీడిపప్పు పాలు తాగాల్సి ఉంటుంది. 

Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు  

కొబ్బరి పాలు:
మధుమేహంతో బాధపడుతున్నవారు కొబ్బరి పాలు కూడా తాగొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్లు, ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు మధుమేహంతో బాధపడుతున్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పాలు క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

బాదం పాలు:
మధుమేహంతో బాధపడుతున్నవారికి బాదం పాలు తాగడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు పెరగవని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్‌ రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాకుండా ఈ పాలలో ఆవు పాల కంటే తక్కువ కేలరీలు, కార్బోహైడ్రేట్ల లభిస్తాయి. కాబట్టి టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో బాదం పాలు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. 

Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

IPL newsPBKS Vs RR ScorecardPBKS vs RRPBKS Vs RR Live Updates

Trending News