Benefits Of Black Salt: ఉప్పు లేని ఆహారం తినడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే.. అందరూ నోటికి రుచి కలిగేలా ఉండడానికి ఆహారాల్లో ఉప్పును వినియోగిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉప్పు కారణంగా వస్తున్న అధిక రక్తపోటు సమస్యను దృష్టిలో పెట్టుకొని చాలామంది బ్లాక్ సాల్ట్ ను వినియోగించడం ప్రారంభించారు. ఈ ఉప్పును వినియోగించడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు మధుమేహం ఉన్నవారు ఆహారాల్లో దీనిని వినియోగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు తీసుకునే రైతా సలాడ్స్ లో ఈ ఉప్పును వినియోగించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఈ ఉప్పును వినియోగించే వారికి ఈ ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నల్ల ఉప్పులో ఉండే పోషకాలు:
బ్లాక్ సాల్ట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో పొటాషియంతో పాటు మెగ్నీషియం, క్యాల్షియం వంటి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ ఉప్పును ఒక గ్లాసు నీటిలో కలుపుకొని తాగితే ఊహించని ఫలితాలు పొందుతారు.
బ్లాక్ సాల్ట్ బెనిఫిట్స్:
మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది:
తరచుగా చాలామందిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు ఒక్కసారిగా పెరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఒక గ్లాసు నీటిలో పది మిల్లీ గ్రాముల నల్లుప్పును కలుపుకొని తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మధుమేహం కారణంగా వచ్చే గుండెపోటు అధిక రక్తపోటు సమస్యల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
Also read: Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్ బ్రాడ్..
జీర్ణ క్రియను మెరుగు పరుచుతుంది:
ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు బ్లాక్ సాల్ట్ కలిపిన వాటర్ ని తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు గ్యాస్, ఎసిడిటీ వంటి పొట్ట సమస్యలను కూడా సులభంగా తగ్గిస్తాయి. అంతేకాకుండా ఇందులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ఇలా ప్రతిరోజు తాగడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది.
జుట్టును దృఢంగా చేస్తుంది:
తరచుగా జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జుట్టుకు నల్ల ఉప్పుతో తయారుచేసిన నీటిని పట్టించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల స్కాల్ప్ శుభ్రంగా తయారై జుట్టు రాలడం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. డాండ్రఫ్ సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ నీరు ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ట్రై చేసి చూడండి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్ బ్రాడ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook