Cancer Prevention Tips: ఏ వయస్సు దాటాక కేన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది, కేన్సర్‌లో ఎన్ని రకాలున్నాయి

Cancer Prevention Tips: కేన్సర్ ఓ ప్రమాదకరమైన, ప్రాణాంతక వ్యాధి. శరీరంలో ఏ భాగానికైనా సోకవచ్చు. వయస్సు పెరిగేకొద్దీ కేన్సర్ ముప్పు పెరుగుతుంది. ఏ వయస్సు తరువాత కేన్సర్ ముప్పు అధికంగా ఉంటుందో చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 7, 2023, 06:47 PM IST
Cancer Prevention Tips: ఏ వయస్సు దాటాక కేన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది, కేన్సర్‌లో ఎన్ని రకాలున్నాయి

కేన్సర్ వ్యాధి పేరు వింటే చాలు చాలామంది భయపడతారు. ఎందుకంటే కేన్సర్ ఓ ప్రాణాంతక వ్యాధి. అయితే సకాలంలో కేన్సర్ గుర్తించగలిగితే నివారణకు సులభమౌతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే సాధారణంగా పరిస్థితి చేయి దాటేవరకూ కేన్సర్ గుర్తించలేకపోవడమే అసలు సమస్య. అందుకే ఎప్పటికప్పుడు కేన్సర్ లక్షణాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. 

కేన్సర్ ఉన్నట్టు  గుర్తించలేకపోతే ఆ వ్యక్తి మరణం తధ్యం. శరీరంలోని ఏ భాగానికైనా కేన్సర్ సోకవచ్చు. వయస్సు పెరిగే కొద్దీ కేన్సర్ ముప్పు కూడా పెరుగుతుంటుంది. కొన్ని వస్తువులతో కేన్సర్ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు. చెడు ఆహారపు అలవాట్లు, సిగరెట్, టొబాకో, మద్యం వంటి దురలవాట్లు కేన్సర్‌ను పెంచేందుకు దోహదపడతాయి.

లివర్ కేన్సర్, లంగ్ కేన్సర్, సర్వైకల్ కేన్సర్, బ్రెస్ట్ కేన్సర్, కోలన్ కేన్సర్, ఓరల్ కేన్సర్ ఇందులో ప్రధానమైనవి. ఎక్కువమంది ఈ కేన్సర్‌లకే గురవుతుంటారు. కొన్ని కేన్సర్ రకాలు చర్మంలో ఉంటాయి. ఇంకొన్ని మజిల్స్‌లో ఉంటాయి. కేన్సర్‌ను లో గ్రేడ్, హై గ్రేడ్‌లో విభజిస్తారు. లో గ్రేడ్ కేన్సర్ అనేది నెమ్మది నెమ్మదిగా వ్యాపిస్తుంది. అటు హై గ్రేడ్ కేన్సర్ మాత్రం చాలా వేగంగా వ్యాపిస్తుంది. హై గ్రేడ్ కేన్సర్‌లో ప్రాణాలు పోగొట్టుకునే ముప్పు ఎక్కువ. 50 ఏళ్ల వయస్సు దాటిన తరువాత కేన్సర్ ముప్పు పెరిగిపోతుంది. ఈ వ్యాధి ఏ వయస్సువారికైనా రావచ్చు. కొంతమందికి జెనెటిక్ కారణాలుంటాయి. ఇంకొంతమందికి సూర్య కిరణాలతో ప్రభావితం కావడం వల్ల స్కిన్ కేన్సర్ రావచ్చు.

కేన్సర్‌కు సరైన చికిత్స ఏమిటి

కేన్సర్‌ను ప్రాధమిక దశలో గుర్తించగలిగితే..చికిత్స ద్వారా ఆ వ్యక్తి ప్రాణాలు నిలబెట్టవచ్చంటున్నారు వైద్యులు. కేన్సర్ ఒకవేళ ఒకేచోట స్థిరంగా ఉంటే సర్జరీ ద్వారా తొలగించవచ్చు. కానీ ఒకవేళ ఎక్కువ భాగాలకు విస్తరిస్తే మాత్రం కీమోథెరపీ, రేడియేషన్ సహా వివిధ పద్ధతులతో చికిత్స చేస్తారు. కేన్సర్ ఉన్నప్పుడు రోగి సాధ్యమైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. ఆలస్యం చేస్తే ప్రాణాలు పోయే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి.

Also read: Fruits for Skin: డైట్‌లో ఈ పండ్లు చేరిస్తే..శిల్పాశెట్టిలా నిత్య యౌవనం మీ సొంతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News