Chemicals found in junk foods: ఈ జంక్ ఫుడ్‌‌లో హానికరమైన రసాయనాలు

Harmful chemicals used in junk food: ప్లాస్టిక్, రబ్బర్ ఉత్పత్తులతో పాటు బట్టలు ఉతికేందుకు ఉపయోగించే డిటర్జెంట్స్‌ని (Chemicals used in detergents) తయారు చేసేందుకు వినియోగించే ఫాలేట్స్ అనే రసాయనాన్ని కలుపుతున్నట్టు పలు యూనివర్శిటీలు జరిపిన పరిశోధనలో తేలిందట.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2021, 07:13 PM IST
Chemicals found in junk foods: ఈ జంక్ ఫుడ్‌‌లో హానికరమైన రసాయనాలు

Harmful chemicals used in junk food: మెక్ డొనాల్డ్స్, బర్గర్ కింగ్, పిజ్జా హట్ వంటి ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్‌లో లొట్టలేసుకుంటూ ఆరగించే చాలా ఆహార పదార్థాల్లో ఒక రకమైన హానికరమైన కెమికల్స్ ఉపయోగిస్తున్నట్టు ఒక పరిశోధనలో వెల్లడైంది. ప్లాస్టిక్, రబ్బర్ ఉత్పత్తులతో పాటు బట్టలు ఉతికేందుకు ఉపయోగించే డిటర్జెంట్స్‌ని (Chemicals used in detergents) తయారు చేసేందుకు వినియోగించే ఫాలేట్స్ అనే రసాయనాన్ని కలుపుతున్నట్టు పలు యూనివర్శిటీలు జరిపిన పరిశోధనలో తేలిందట. 

జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ, సౌత్ వెస్ట్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, బోస్టన్ యూనివర్శిటీ, హార్వర్డ్ యూనివర్శిటీలు ఎక్స్‌పోజర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఎపిడెమియాలజీ అనే వీక్లీ జర్నల్ ఈ అధ్యయనం గురించి ప్రచురించాయి. దీర్ఘకాలం పాటు ఈ జంక్ ఫుడ్ తినే వారిలో అనేక పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు (Health hazards) తలెత్తుతాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు మెదడు పని తీరును దెబ్బతీస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 

ప్లాస్టిక్, రబ్బర్ ఉత్పత్తులు తయారు చేసే క్రమంలో వాటిని వివిధ రూపాల్లో, ఆకారాల్లో మృధువుగా చేసేందుకు వీలుగా ఉపయోగపడేది ఈ ఫాలెట్స్. హమ్‌బర్గర్స్, వేపుళ్లు, చికెన్ నగెట్స్, చికెన్ బరియట్స్, చీజ్ పిజ్జా వంటి ఆహారపదార్థాల నుంచి 64 శాంపిల్స్‌ని తీసుకుని జరిపిన పరిశోధనల్లో 80 శాతానికిపైగా ఆహారపదార్థాల్లో ఫాలెట్స్ ఉన్నట్టు గుర్తించారు. 

Also read : Weight gain Tips for Girls: అమ్మాయిలు.. సన్నగా ఉన్నారని బాధపడుతున్నారా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవండి

కాస్మెటిక్స్, వినైల్ ఫ్లోర్స్, డిజర్జెంట్స్, గ్లోవ్స్, తీగల చుట్టూ ఉండే రబ్బర్, ప్లాస్టిక్ కవర్లలో ఈ ఫాలెట్స్ (Phthalates) ఉపయోగిస్తారు. వీటిలో ఫాలెట్స్‌ని ఉపయోగించడం ద్వారా ఆయా ఉత్పత్తులు మృధువుగా ఉండటంతో పాటు అవసరానికి అనుగుణంగా మల్చుకునే స్వభావం సంతరించుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఫాలెట్స్ కలిపిన ఆహార పదార్థాలు తినడం వల్ల ఆస్తమా, చిన్నపిల్లలో మెదడు పని తీరును దెబ్బతీయడం, పెద్ద వారిలో సంతానోత్పత్తి వ్యవస్థని (asthma, brain impairment and reproductive system) దెబ్బతీయడం వంటి దుష్పరిణామాలు కలిగే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Also read : Balloon Treatment: హైదరాబాద్‌లో తొలిసారిగా గుండె జబ్బులకు బెలూన్ చికిత్స

Also read : Health Tips for Bone Strength: ఎముకలు, కండరాల పటిష్ఠతకు ఈ ఆహారం తప్పనిసరి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News