Cholesterol Reducing Foods: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా మందిలో గుండెపోటు, మధుమేహం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆహారం, జీవశైలిలో మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యల నుంచి తప్పకుండా పలు రకాల చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.
అధిక కొలెస్ట్రాల్ నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ 5 ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది:
శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్తంలో మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ధమనిలో రక్త ప్రసరణలో సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే గుండెపోటు, పక్షవాతం తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.
1. టమోటా రసం:
టమోటా రసంలో లైకోపీన్ అనే పోషకాలు ఉంటాయి. ఇది శరీరంలోని లిపిడ్ స్థాయిలను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. టొమాటో జ్యూస్‌లో కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఫైబర్ మరియు నియాసిన్ ఉంటాయి కాబట్టి రోజూ ఒక గ్లాసు తాగండి.
2. బెర్రీ స్మూతీ:
బెర్రీ స్మూతీలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ జ్యూస్‌ని క్రమం తప్పకుండా తాగితే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగగ్గుతాయి.
3. ఓట్స్ డ్రింక్:
ఓట్స్ అనేది ఒక ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో ఉండే బీటా గ్లూకాన్స్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతాయి. కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి తప్పకుండా ఓట్స్‌తో తయారు చేసిన డ్రింక్స్ తాగాల్సి ఉంటుంది.
4. గ్రీన్ టీ:
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా గ్రీన్ టీని తాగాల్సి ఉంటుంది. ఈ టీలను క్రమం తప్పకుండా తాగితే చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది.
Also Read: Nanda Kumar Bail: నంద కుమార్‌కి బెయిల్.. అంతలోనే పిటి వారంట్ కావాలన్న పోలీసులు
Also Read: Harish Rao: ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్ధానం ఏమైందన్న మంత్రి హరీశ్ రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook