Coffee Facial At Home: ఇక నుంచి పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు..ఇలా ముఖానికి కాఫీ వాడడండి.!!

Coffee Facial At Home: అందమైన, మచ్చలేని చర్మాన్ని అందరూ ఇష్టపడతారు. ముఖంలో మెరుపు తేవడానికి పార్లర్‌కి వెళ్లి ఖరీదైన ఫేషియల్‌లు చేసుకుంటారు. అయినప్పటికీ కొందరు ఆశించిన ఫలితాన్ని పొందలేక పోతున్నారు. అందమైన, మచ్చలేని ముఖం కోసం పలు రకాల హానికరమైన ఉత్పత్తులను కూడా వాడుతున్నారు. దీంతో వారు ముఖాన్ని పాడుచేసుకుని  బాధపడుతున్నారు.

Last Updated : May 21, 2022, 01:25 PM IST
  • ఇక నుంచి పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు
  • మెరిసే చర్మం కోసం కాఫీ వాడడండి
  • కాఫీ ద్వారా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతుంది
Coffee Facial At Home: ఇక నుంచి పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు..ఇలా ముఖానికి కాఫీ వాడడండి.!!

Coffee Facial At Home: అందమైన, మచ్చలేని చర్మాన్ని అందరూ ఇష్టపడతారు. ముఖంలో మెరుపు తేవడానికి పార్లర్‌కి వెళ్లి ఖరీదైన ఫేషియల్‌లు చేసుకుంటారు. అయినప్పటికీ కొందరు ఆశించిన ఫలితాన్ని పొందలేక పోతున్నారు. అందమైన, మచ్చలేని ముఖం కోసం పలు రకాల హానికరమైన ఉత్పత్తులను కూడా వాడుతున్నారు. దీంతో వారు ముఖాన్ని పాడుచేసుకుని  బాధపడుతున్నారు. అయితే అటువంటి పరిస్థితిలో ఇంట్లో తయారు చేసిన కాఫీని ఫేషియల్‌గా ఉపయోగించమని నిపుణులు తెలుపుతున్నారు.

కాఫీలో ఉండే గుణాలు మన చర్మాన్ని తేమగా చేయ్యడమే కాకుండా..వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్‌ను తొలగించడానికి ఉపయోగపడుతుంది. కాఫీ ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. కాఫీ సహాయంతో చర్మంపై నల్ల మచ్చలను తేలికగా తోటగించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. కాఫీ చర్మానికి పార్లర్ లాంటి గ్లో ఇస్తుందని నిపుణులు పేర్కొన్నారు. కాఫీ చర్మానికి ఏ రకమైన ప్రయోజనాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మెరిసే చర్మం కోసం కాఫీని ఎలా ఉపయోగించాలి:

ముందుగా ఒక గిన్నెలో రెండు చెంచాల పచ్చి పాలను తీసుకుని అందులో ఒక చెంచా కాఫీ పొడిని కలపండి. మీరు కాటన్ సహాయంతో దీనిని మొత్తం ముఖం, మెడపై అప్లై చేసి శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ముఖంలోని దుమ్ము తొలగిపోయి ముఖం శుభ్రంగా అవుతుంది. అయితే పచ్చి పాలు ఫేషియల్ పిగ్మెంటేషన్‌ను తొలగించి చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.

తర్వాత కాఫీ స్క్రబ్ చేయండి:

ఒక చెంచా ఓట్స్ పౌడర్, ఒక చెంచా కాఫీ పౌడర్, రెండు చెంచాల మీగడ పెరుగు తీసుకుని.. దానిని మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు తేలికైన చేతులతో ముఖంపై అప్లై చేసి మసాజ్ చేయండి. 2 నిమిషాల తర్వాత దీనిని చల్లని నీరుతో కడిగేయాలి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న వారు ఇలా చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు.

కాఫీ ఫేస్ మాస్క్:

ఒక చెంచా శెనగపిండి, అర చెంచా కాఫీపొడి, అర చెంచా చందనం పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు వాటిని మిక్సీలో పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం ద్వారా సన్‌టాన్‌ని తొలగించి ముఖానికి సహజమైన కాంతిని అందిస్తుంది.

Also Read: Skin Care Tips: పుట్టుమచ్చలు, మొటిమల నుంచి ఈ చిట్కా ద్వారా సులభంగా విముక్తి పొందండి..!!

Also Read: Digestion Problem: పుల్లని త్రేన్పు(Burping)లతో బాధపడుతున్నారా.!! ఈ 4 చిట్కాలతో చిటికెలో ఉపశమనం పొందండి..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

 

Trending News