Corona New Variant: యూకేను ఆందోళన కల్గిస్తున్న కరోనా కొత్త రకం వేరియంట్, అలర్ట్ జారీ

Corona New Variant: ప్రపంచాన్ని కరోనా వైరస్ ఇంకా భయపెడుతూనే ఉంది. కరోనా కొత్త కొత్త వేరియంట్లతో వణుకు పుట్టిస్తోంది. డెల్టా వైరస్ ఉపవర్గంగా ఉన్న ఏవై 4.2 ఇప్పుడు యూకేను ఆందోళన కల్గిస్తోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 23, 2021, 06:22 AM IST
  • కొత్త కొత్త వేరియంట్లతో ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్
  • యూకేలో ఆందోళన కల్గిస్తున్న కరోనా కొత్త వేరియంట్ల డెల్టా ఉపరకమైన ఏవై 4.2
  • యూరప్‌లో రోజుకు 50 వేల కేసుల నమోదు
Corona New Variant: యూకేను ఆందోళన కల్గిస్తున్న కరోనా కొత్త రకం వేరియంట్, అలర్ట్ జారీ

Corona New Variant: ప్రపంచాన్ని కరోనా వైరస్ ఇంకా భయపెడుతూనే ఉంది. కరోనా కొత్త కొత్త వేరియంట్లతో వణుకు పుట్టిస్తోంది. డెల్టా వైరస్ ఉపవర్గంగా ఉన్న ఏవై 4.2 ఇప్పుడు యూకేను ఆందోళన కల్గిస్తోంది. 

కరోనా సంక్రమణ ప్రపంచాన్ని ఇంకా వీడటం లేదు. ఎప్పటికప్పుడు కరోనా కొత్త వేరియంట్లు(Corona New Variant) పుట్టుకొస్తున్నాయి. మొన్నటి వరకూ ప్రపంచాన్ని వణికించిన డెల్టా వేరియంట్ ఉపవర్గంగా ఏవై 4.2 ఇప్పుడు ప్రపంచ దేశాల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా కొన్ని చోట్ల ఏవై 4.2 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా వైరల్‌లో రెండేళ్లుగా జన్యుపరమైన మార్పులు చోటు చేసుకోవడమే దీనికి కారణం. ఇప్పుడు కరోనా ఏవై 4.2 కేసులు యూకేను కలవరపెడుతున్నాయి.

అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లో కూడా కరోనా ఏవై 4.2 వేరియెంట్‌(Corona new variant AY 4,2) కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా భారత్‌లో వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియెంట్‌లో(Delta Variant) ఇప్పటిదాకా 55 సార్లు జన్యుపరమైన మార్పులు జరిగాయి. అయితే ఆ మార్పుల్లో ఏవీపెద్దగా ప్రమాదకరం కాలేదు. తాజాగా ఏవై.4.2 వ్యాప్తి తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వేరియంట్‌ తొలి సారిగా జూలైలో యూకేలో బయటపడింది. కరో నా వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ మ్యుటేషన్లు అయిన ఏ222వీ,  వై145హెచ్‌ల సమ్మేళనంగా ఈ కొత్త వేరియెంట్‌ పుట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్‌లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకీ ఆ దేశంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. వారం రోజులుగా ప్రతిరోజూ 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 52 వేల కేసులు నమోదయ్యాయి. జూలై 17 తర్వాత అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. యూకేలో(UK) కరోనా రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో 96 శాతం ఏవై.4.2 వేరియంట్‌వే కావడం ఆందోళన కలిగిస్తోంది. యూకేలో డెల్టా రకం కరోనా కేసులతో పోలిస్తే ఈ కేసులు 10 శాతం అధికంగా వ్యాప్తి చెందుతున్నట్టుగా పరిశోధకులు తెలిపారు. 

ఇక రష్యాలో కూడా కరోనా కేసులు(Russia Corona Update) రికార్డు స్థాయిలో నమోదగవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 37 వేల 141 కొత్త కేసులు నమోదు కాగా 1 వేయి 64 మంది మరణించారు. యూరప్‌లోనే అత్యధికంగా రష్యాలో 2 లక్షల 28 వేల 453 కరోనా మరణాలు రికార్డయ్యాయి. దీంతో అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 7 వరకు ఇళ్లలోనే ఉండిపోవాల్సిందిగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ ప్రజలను కోరారు. 

Also read: Vladimir Putin: అయ్యయ్యో వద్దమ్మా...ఆఫీసుకు రావొద్దు..కానీ జీతాలిస్తాం..సుఖీభవ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News