Covid19 Cases in India: దేశంలో కోవిడ్ మహమ్మారి మరోసారి కోరలు చాచేందుకు సిద్ధమౌతోంది. కరోనా వైరస్ కేసులు రోజురోజకూ పెరుగుతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలో 1000 వరకూ కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది.
కరోనా మహమ్మారి మరోసారి ఆందోళన కల్గిస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో నమోదైన కేసులు 1000 దాటాయి. ఒక్కరోజులో 1000 కేసులు దాటడం దాదాపు నాలుగున్నర నెలల తరువాత ఇదే. గత వారం రోజుల్నించి కోవిడ్ కేసులు మరింతగా పెరిగిపోయాయి. ఇండియాలో శనివారం నాడు 1071 కొత్త కేసులు నమోదయ్యాయి. 2022 నవంబర్ తరువాత ఇదే అత్యధికం. గత వారం రోజుల్లో అంటే మార్చ్ 12-18 మధ్య కరోనా వైరస్ కొత్త కేసులు 5000 నమోదయ్యాయి. అంతకుముందు ఏడురోజులతో పోలిస్తే 85 శాతం ఎక్కువ. గత వారం రోజుల్లో కరోనా కారణంగా దేశంలో 19 మంది మరణించారు.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేసింది. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరింది. కరోనా మహమ్మారి విషయంలో దేశం మరోసారి అలర్ట్ కావల్సిన అవసరమేర్పడింది. గత కొద్దిరోజుల్నించి కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ అలర్ట్ జారీ చేసింది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, 5 రోజులు దాటి దగ్గు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. లక్షణాలు తీవ్రంగా ఉంటే వైద్యుడి సలహా మేరకు 5 రోజులపాటు రెమిడెసివిర్ తీసుకోవచ్చు. ఈ మార్గదర్శకాలపై జనవరిలోనే సమీక్ష జరిగింది. క్లినికల్ పరీక్షలో తేలనంతవరకూ యాంటీ బయోటిక్స్ ఉపయోగించవద్దని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. 526 కొత్త కేసులు నమోదయ్యాయి.
దేశంలో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు టెస్ట్, ట్రాక్, ట్రీట్, టీకా వ్యూహాన్ని అవలంభించాలని..ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య గత ఆదివారం 3,778 ఉంటే ఇప్పుడు 6 వేలకు పెరిగింది. గత ఏడు రోజుల్లో మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర మార్చ్ 12-18 మధ్యకాలంలో 1165 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు 7 రోజులతో పోలిస్తే 2.3 రెట్లు ఎక్కువ. కేరళలో కోవిడ్ కేసులు 520 నుంచి పెరిగి 739కు చేరుకుంది. కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య కొద్దిగా పెరిగాయి. రాష్ట్రంలో గత వారం రోజుల్లో 656 కేసులు నమోదయ్యాయి.
గుజరాత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. వారం రోజుల్లో 660 కేసులు నమోదయ్యాయి. గత వారంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. దేశ రాజధాని ఢిల్లీలో 235 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఢిల్లీలో 72 కొత్త కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సైతం కేసులు పెరుగుతున్నాయి.
Also read: Reduce Bad Cholesterol: ఈ పండుతో 8 రోజుల్లో చెడు కొలెస్ట్రాల్ వెన్నలా కరడం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook