Curry Leaf Water Benefits: కరివేపాకు ఆహారాల రుచిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది ఎక్కువగా వంటకాల్లో వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ కరివేపాకు ఆహారాలకు రుచిని అందించడమే కాకుండా శరీరానికి బోలెడు లాభాలను చేకూర్చుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి తీవ్ర వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. దీంతో పాటు శరీర చురుకుగా మారుతుంది.
తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కరివేపాకుతో తయారు చేసిన డిటాక్స్ డ్రింక్‌ను ప్రతి రోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఈ డిటాక్స్ డ్రింక్‌లో ఉండే మూలకాలు ఏయే వ్యాధులకు ప్రభావంతంగా సహాయపడతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:
శరీర ఆరోగ్యంగా ఉండడానికి జీర్ణక్రియ సహాయం ఎంతగానో అవసరం..కాబట్టి జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండడానికి కరివేపాకు డిటాక్స్ డ్రింక్‌ను ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది. ఇందులో లభించే ఎంజైములు మల విసర్జన సులువుగా చేసేందుకు కూడా సహాయపడతాయి. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుచుతాయి.
ఒత్తిడిని తగ్గిస్తుంది:
ఒత్తిడి సమస్యలు రావడం సర్వసాధారణం..కానీ ఈ సమస్యలు చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిలో వస్తున్నాయి. కాబట్టి మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా కరివేపాకు డిటాక్స్ డ్రింక్‌ను తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు సులభంగా ఒత్తిడిని తగ్గిస్తాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుతాయి:
కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా మొత్తంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు డిటాక్స్ డ్రింక్‌ను తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
డయాబెటిస్ ఉన్నవారి కోసం..
కరివేపాకు నీరు మధుమేహంతో బాధపడేవారికి కూడా ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల బ్లడ్‌లోని షుగర్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయి. ఇందులో లభించే కార్బజోల్ ఆల్కలాయిడ్స్ మధుమేహంతో బాధపడేవారి గ్లూకోజ్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి