Zycov D vaccine: దేశంలో మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్ అందుబాటులో వస్తోంది. చిన్నారులకు సైతం వ్యాక్సిన్ అందనుంది. దేశీయంగా అభివృద్ధి చెందిన తొలి చిన్నారుల వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది.
దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్(Corona Vaccination)ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో ఇప్పటి వరకూ మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వి వ్యాక్సినేషన్ జరుగుతోంది. మరోవైపు అమెరికాకు చెందిన మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లకు కూడా డీసీజీఐ అనుమతిచ్చినా..ఇంకా అందుబాటులో రావల్సి ఉన్నాయి. ఈ తరుణంలో మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్ జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్ డి వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతిచ్చింది.సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ మూడు డోసుల జైకోవ్ డి వ్యాక్సిన్‌కు ఆమోదానికి సిఫారసు చేయడంతో డీసీజీఐ(DCGI)అనుమతి లభించింది. ఇది రెండవ మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కావడం ఓ ప్రత్యైకత అయితే..చిన్నారులకు అంటే 12 ఏళ్లు దాటినవారికి కూడా అందుబాటులో వచ్చిన తొలి వ్యాక్సిన్ ఇదే.
గుజరాత్‌కు చెందిన జైడస్ క్యాడిలా సంస్థ జైకోవ్ డి వ్యాక్సిన్(Zycov D vaccine) అభివృద్ది చేసింది. ఇది మిగిలిన వ్యాక్సిన్ల కంటే భిన్నంగా మూడు డోసుల్ని కలిగి ఉంది. మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తరువాత రెండవ డోసు, ఆ పై 45 రోజుల తరువాత మూడవ డోసు ఇవ్వాల్సి ఉంటుంది. సూది లేకుండా ఇంట్రాడెర్మల్ ప్లాస్మిడ్ డీఎన్రే వ్యాక్సిన్ కావడంతో యాంటీబాడీలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయని..సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువేనని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. 12 ఏళ్లు పైబడినవారిపై కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడంతో చిన్నారులకు సైతం అందుబాటులో వచ్చిన తొలి వ్యాక్సిన్‌గా నిలిచింది. ఏడాదికి 120 మిలియన్ డోసుల్ని ఉత్పత్తి చేయాలనేది కంపెనీ లక్ష్యంగా ఉంది.
Also read: Covid19 Vaccine: కరోనా వైరస్ నియంత్రణలో వ్యాక్సిన్ ప్రభావం ఉందా, ఆ నివేదిక ఏం చెబుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook